సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కీలక నిర్ణయం తీసుకున్నది. లెఫ్టినెంట్ కల్నల్ అంతకంటే ఎక్కువ స్థాయి సీనియర్ అధికారులు ఇకపై అధికారిక కమ్యూనికేషన్స్ కోసం కేవలం ఐఫోన్స్‌ను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్స్‌ను పూర్తిగా నిషేధించారు. అనేక ఉల్లంఘనలు, సైన్యంలో సైబర్ గూఢచౌర్యం కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ డివైజెస్‌లో సైబర్ దాడులు పెరుగుతున్నట్లుగా ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో, జెరూసలేం పోస్ట్ తెలిపాయి.

