హెలికాప్టర్లో నెల్లూరు చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు ముందుకొచ్చారు. దీంతో హెలిపాడ్ దగ్గరకు అనుమతి లేదంటూ వచ్చిన కార్యకర్తలను పోలీసులు తరిమేశారు. అక్కడి నుంచి జగన్ కాన్వాయ్‌లో
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో నెల్లూరు జైలులో ములాఖత్ అయ్యి ఆయనను పరామర్శించారు. తర్వాత జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో జగన్ చూసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

