‘టాక్సిక్’ సినిమాలో యశ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై తీసిన ఓ పాట, సినిమాలోని కొన్ని ఇంటిమేట్ సీన్స్, టీజర్‌లోని కొన్ని షాట్స్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. ఆ సీన్స్ చూసుకుని కియారా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని టాక్. అందుకే, ఆ సీన్స్ నిడివిని తగ్గించాలని లేదా పూర్తిగా సినిమా నుంచి తీసేయాలని ఆమె టీమ్‌ను రిక్వెస్ట్ చేశారట. ఆ సీన్స్ అలాగే ఉంటే తన ఫ్యామిలీ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

