తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ (BJP) ని గెలిపిస్తే మహా జంగిల్ రాజ్ నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దారుణాలకు పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడతామని అన్నారు.

