ప్రకాశం జిల్లా పొదిలి ఎస్ఐ వేమన వ్యవహారశైలిపై జనం తిరగబడ్డారు. ఓ వ్యాపారస్థుడ్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బూతులు తిట్టారంటూ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఓ షాపు ముందు లారీ రోడ్డుకు అడ్డంగా ఉందంటూ తొలుత లారీ డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా షాపు యజమానులైన తండ్రీ కొడుకులను చితకబాది తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. బాధితులతో కలిసి ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం పోలీసుశాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది.

