బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ అన్నారు. ఆ పార్టీలో బీజేపీ ఐడియాలజీతో ఉన్నవాళ్లు బీజేపీలోకి వెళ్తారని, సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని విశ్వసించేవారు ఆర్జేడీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. జేడీయూపై, నితీశ్ కుమార్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. పార్టీ క్యాడర్ కూడా నితీశ్ విధానాలతో అసంతృప్తిగా ఉందని తెలిపారు. అందుకే ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని చెప్పారు.

