అశ్వగంధ వేర్లు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుకలో ఉన్నాయి. FSSAI తాజా అడ్వైజరీ ప్రకారం ఆహార ఉత్పత్తులలో కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన సారాన్ని మాత్రమే వాడాలి. కానీ ఆకులు, కాడలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుల్లో ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కాలేయంపై విషప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అశ్వగంధ ఆకుల వాడకంపై నిషేధం విధించింది.

