కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే, అప్పుడు ఆయుధాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. నేనేమీ మిలిటరీ వ్యక్తిని కాదు అని, కానీ యుద్ధం గురించి తెలుసు అని, 1989లో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం ఆయుధాన్ని పట్టుకోను అని, కానీ స్వదేశం కోసం మాత్రం ఆయుధాన్ని చేతబూనాల్సి వస్తుందని పెట్రో అన్నారు. ఎం-19 కమ్యూనిస్టు గెరిల్లా గ్రూపులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 1980 తర్వాత ఆయుధాలు వీడి, కొలంబియా ప్రధాన రాజకీయాల్లో చేరారు.

