పాక్ వాయుసేన శనివారం రాత్రి అఫ్గానిస్థాన్లో వైమానిక దాడులు నిర్వహించింది. పాక్-అఫ్గాన్ సరిహద్దు వెంబడి పలు ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో సుమారు 17 మంది మృతి చెందారు. ఉగ్ర మూకలు దాక్కున్న ప్రాంతాలపై ఈ దాడులు చేశామని పాక్ తెలిపింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఏడు స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేసిందని తెలిపారు. పాక్ తాలిబాన్లు, వారి స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని చెప్పారు.

