ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (రేష్మ–24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. కేరళలో కాసర్కోడ్ నగర సమీపంలోని అద్దె క్వార్టర్స్‌లో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న చిన్ను పప్పు స్థానిక భాషలో వీడియోలతో ప్రసిద్ధి చెందింది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కేవలం నెల రోజుల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకులతో తలెత్తిన మనస్తాపం లేదా వ్యక్తిగత కారణాలేమైనా ఆత్మహత్యకు దారితీశాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

