అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ వ్యవహారంతో సంబంధం ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. హనీట్రాప్ ముఠాతో చేతులు కలిపిన నలుగురు పోలీసులను ఏకంగా సర్వీసు నుండి తొలగిస్తూ (డిస్మిస్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల నుండి తొలగించిన వారిలో రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ దుర్గాప్రసాద్, దేవ్లానాయక్ ఉన్నారు. రూరల్ సీఐ శేఖర్‌ను వీఆర్ కు,ఎస్ఐ రాంబాబుతో పాటు కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాంలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

