రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో ఇవాళ అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 8.8గా నమోదు అయ్యింది. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకారం.. భూకంపాల చరిత్రలో ఇది ఆరవ అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు అయ్యింది. భూగోళాన్ని కుదిపేసిన అతి తీవ్రమైన పది భూకంపాల్లో తాజా భూకంపం నిలుస్తుందని హవాయి వర్సిటీ ప్రొఫెసర్ హెలిన్ జానిస్జెవిస్కీ తెలిపారు. ఇదే స్థాయిలో గతంలో 2010లో చిలీ దేశంలో, 1906లో ఈక్వెడార్‌లో భూకంపం నమోదు అయినట్లు చెప్పారు.

