సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.ఇప్పటి వరకూ సుమారు 2 వేల మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని వారు ఆరోపించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

