దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధానంగా హాజరైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విందు కార్యక్రమంలో తెలుగు దేశం కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

