loader

కశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ రెచ్చగొట్టే వాగుడు

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులకు బహిరంగంగా మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. మరణించిన ఉగ్రవాదులను అమరవీరులు అని ఆయన అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను చట్టబద్ధమైన పోరాటం అని పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతను పాకిస్థాన్‌ అందిస్తుందని తెలిపారు.

బంగ్లాదేశ్‌‌కు బిగ్ షాకిచ్చిన మోదీ సర్కార్..

బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను పట్టించుకోకపోవడంపై ఆ దేశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి దుస్తులు, జనపనార దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. జనపనార దిగుమతులను ముంబైలోని నవా షెవా ఓడరేవు ద్వారా మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇతర భూ మార్గాలు లేదా సముద్ర మార్గాల ద్వారా అనుమతించబోమని స్పష్టం చేసింది.

విమానంలో తగ్గిన ఆక్సిజన్..ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం అరేబియా సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు సమస్య తలెత్తింది. అడిస్ అబాబా నుంచి ముంబైకి వస్తున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ET640 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) విమానం 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా క్యాబిన్‌లో డీప్రెషరైజేషన్ సమస్య తలెత్తింది. దీంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

అణుడీల్‌ కుదరాలంటే.. ఖమేనీని మర్యాదగా సంబోధించాలి

అయతొల్లా అలీ ఖమేనీ ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ సీరియస్‌ అయ్యింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానని, అయినా అతడు కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ‘ట్రంప్‌ నిజంగా మాతో అణు ఒప్పందాన్ని కోరుకుంటుంటే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని మర్యాదగా సంబోధించాలి. ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

‘నో స్పేస్‌ ఫర్‌ బెజోస్‌’.. అపర కుబేరుడు పెళ్లికి నిరసన సెగ

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనంటారు..! ఇప్పుడు వెనిస్‌ వాసులూ అదే ఫీలింగ్‌లో ఉన్నారు. అపర కుబేరుడు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ అదరహో అనేలా.. వెనిస్‌ వైపు ప్రపంచదేశాలు చూసేలా వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకుంటే.. నీ పెళ్లొద్దు, నువ్వసలే రావొద్దు అంటూ నిరసనలు హోరెత్తిస్తున్నారు. ప్రైవేట్‌ జెట్‌లు, భారీ వాహనాలతో క్లీన్ సిటీ కాస్త పొల్యూషన్‌ సిటీగా మారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెనిస్ వాసులు. అంతేకాదు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయంటూ.. ఆందోళనలు ఉధృతం […]

భార్య, పిల్లలతో బయట కనిపించిన ఉత్తరకొరియా కిమ్

టూరిస్ట్ జోన్‌ను ప్రారంభించడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ తన భార్యా, పిల్లలతో వచ్చారు. వారు ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్స్ వినియోగిస్తూ కెమెరాలకు చిక్కారు. వోన్సన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్, ఉత్తర కొరియా యొక్క తూర్పు తీరంలో ఉన్న వోన్సన్‌లో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఈ రిసార్ట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రిసార్ట్ ను జూలై 1 నుండి దేశీయ సందర్శకుల కోసం తెరుస్తారు. విదేశీ పర్యాటకులకు అనుమతిపై ఇంకా ఎలాంటి […]

మైక్రోసాఫ్ట్‌లో 5 నెలల్లో 7లక్షల జాబ్స్ కట్..

ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగాల్లో కోతలు విధించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్లీ లేఆఫ్స్ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లాభదాయకతను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక మార్పుల కారణంగా.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తోంది.

ఆరేళ్ల తరువాత తెరుచుకోబోతున్న కైలాష్ మానసరోవర్ యాత్ర..

చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు.. తొలి భారతీయుడిగా రికార్డు

ISRO(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) వ్యోమగామి శుభాంశు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. భారత అంతరిక్ష చరిత్రలో గర్వించదగ్గ మైలురాయిని నమోదు చేశాడు. ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచాడు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ సాయంత్రం 4.03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేసింది.

భారతీయుడిపై ట్రంప్ నోటి దురుసు

న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న వారిలోభారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ ఉన్నారు. దీంతో ట్రంప్ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దానీ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ “భయంకరంగా కనిపిస్తున్నాడు, అతని గొంతు గజిబిజిగా ఉంది, అతను అంత తెలివైనవాడు కాదు, డమ్మీస్ అందరూ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప క్షణం!” అని సెటైరిక్‌గా వ్యాఖ్యలుచేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON