loader

షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మంది మృతి

తూర్పు ఇరాక్‌లోని కుట్‌ (Kut) నగరంలోని ఓ హైపర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు బిల్డింగ్‌ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది మరణించినట్లు ప్రావిన్స్‌ గవర్నర్‌ను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఐఎన్‌ఏ నివేదించింది. అనేక మంది గాయపడ్డట్లు పేర్కొంది.

ఇమ్రాన్‌ ఖాన్ మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ కొత్త పార్టీ!

పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడుతూ, పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అనే తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విదుడల చేసిన ప్రకటనలో.. ఆమె ఇలా ప్రస్తావించింది.. ఇది కేవలం ఒక పార్టీ కాదు, రాజకీయాలను సేవగా మార్చడానికి చేపట్టిన ఉద్యమం అని చెప్పుకొచ్చారు. తన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని, పాలక వర్గాలను జవాబుదారీగా […]

రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‍కు 100 శాతం సుంకం: నాటో వార్నింగ్

నాటో భారత్ తో పాటు చైనాకు వార్నింగ్ ఇచ్చింది. రష్యా తో వ్యాపారం చేస్తున్న దేశాలు కచ్చితంగా సవాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. భారత్, బ్రెజిల్, చైనా రష్యాతో వ్యాపారం చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాటో చీఫ్ మార్క్ రూట్ ఈ హెచ్చరికలు చేశారు. 100% సుంకాలు విధిస్తామని ఆయన అన్నారు. ట్రంప్‌ ఈ ప్రకటనలో బ్రెజిల్, చైనా, భారత్‌ పేర్లు తీయలేదు. కానీ మార్క్ రూటే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యాతో వాణిజ్యం […]

భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు తిరిగి భూమికి చేరుకుంది. స్పేస్ నుంచి సోమవారం డ్రాగన్‌ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా..

యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది.వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకు జులై 16 (బుధవారం) ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో యెమెన్‌ చివరి క్షణంలో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి రూ. 11 కోట్ల బ్లడ్‌ మనీ ఇచ్చేందుకు […]

అంతరిక్షంలో హెయిర్ కట్ చేయించుకున్న శుభాన్షు శుక్లా

అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో హెయిర్‌కట్ చేయించుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. భూమికి దూరంగా గురుత్వాకర్షణ లేని వాతావరణంలో జుట్టు కత్తిరించడం అనేది ఒక సంక్లిష్టమైన పని. కత్తిరించిన వెంట్రుకలు తేలియాడి.. అంతరిక్ష కేంద్రంలోని సున్నితమైన పరికరాలలో, ప్రాణ వాయువు వ్యవస్థలలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి వ్యోమగాములు ప్రత్యేకమైన వాక్యూమ్ క్లిప్పర్‌లను ఉపయోగిస్తారు. ఇవి జుట్టును కత్తిరించిన వెంటనే వాటిని లోపలికి పీల్చుకుంటాయి.ఎంతో జాగ్రత్తగా నికోల్ అయర్స్ ముగ్గురు వ్యోమగాములకు […]

ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం.

ఫిజీ దేశంలో కూడా హిందూ ఆలయాలు, సమాజంపై దాడులు జరగడం కలకలం రేపుతోంది.. ఇండో-ఫిజియన్ సమాజంపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వాటిని ఎక్కువగా విస్మరిస్తోందని ఫిజి మాజీ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి విధ్వంసం సృష్టించి, శివుడితో సహా గర్భగుడిలోని దేవతలందరినీ ధ్వంసం చేస్తున్నట్లు చూపించే వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. ఈ సంఘటన చుట్టూ జరుగుతున్న ద్వేషపూరిత వాక్చాతుర్యంపై పోలీసు కమిషనర్ రుసియేట్ తుద్రవు ఆందోళన వ్యక్తం చేశారు.

50 రోజుల్లో మీరు యుద్ధం ఆపకపోతే : రష్యాకు ట్రంప్ వార్నింగ్

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని 50 రోజుల్లో ఆపకుంటే రష్యాపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధాలను ఆపడానికి తాను వాణిజ్యాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటానని స్పష్టం చేశారు. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణను ఆపడానికి సుంకాల బెదిరింపులే పని చేశాయని గుర్తు చేశారు. పుతిన్ పగలు బాగా మాట్లాడి రాత్రి దాడులు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు సహాయం చేసే దేశాలపై కూడా 500 శాతం టారిఫ్‌లు విధిస్తామని వెల్లడించారు.

కెనడాలో రథయాత్ర భక్తులపై గుడ్లు విసిరిన దుండగులు..

దేవుడి రథయాత్రలో భక్తులపై గుడ్లు విసరడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కెనడాలో జరిగింది. టొరంటోలో జరిగిన రథయాత్ర ఊరేగింపులో గుర్తు తెలియని వ్యక్తులు భక్తులపై గుడ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు ఈ దాడులతో జాత్యహంకారాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. టొరంటో వీధుల్లో భక్తులు భక్తి గీతాలు పాడుతూ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమీపంలోని భవనం నుండి ఎవరో వారిపై గుడ్లు విసిరారు. అయినా భక్తులు మాత్రం యాత్రను కొనసాగించారు.

డ్రాగన్ క్రూ అన్‌డాకింగ్ సక్సెస్.. అంతరిక్షం భూమికి బయలుదేరిన శుభాన్షు శుక్లా

18 రోజులు పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా నలుగురు భూమికి తిరుగు పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ కాప్సూల్ విడిపోయింది. అనంతరం భూమి దిశగా పయనం ప్రారంభించింది. 22 గంటల ప్రయాణం అనంతరం ఈ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం (జూలై 15) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా తీరంలో దిగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON