loader

వీసా కావాలంటే 15,000 డాలర్లు కట్టాల్సిందే..!

బిజినెస్‌, టూరిస్ట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద 15వేల డాలర్ల వరకు బాండ్‌ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు ఫెడరల్‌ రిజిస్ట్రీలో మంగళవారం నోటీసులు పబ్లిష్‌ చేయనుంది. ఈ వీసా జారీ అయిన నాటి నుంచి 3నెలల వరకు అమెరికాలో ఉండే వీలుంటుంది,ఒక మనిషినే అనుమతిస్తారు. ప్రయాణికులు వీసా నిబంధనలను పూర్తిగా పాటించి, సరైన సమయంలోగా దేశం విడిచి వెళితే.. వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి వాపసు చేస్తామని […]

త్వరలోనే ఇండియా అమెరికాను దాటేస్తుంది.. OpenAI CEO ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏఐ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ సంస్థ ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ కొత్త మోడల్ జీపీటీ-5ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో ఏఐ వినియోగంపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెరికా తర్వాత ఓపెన్ఏఐకి అతిపెద్ద మార్కెట్‌ ఉన్న దేశం భారత్‌ అని ఆయన అన్నారు. ఇండియాలో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని, అతి తక్కువ సమయంలోనే భారత్‌ ఏఐ వినియోగంలో ఆమెరికాను క్రాస్‌ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీకి చైనా స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్తున్నారు ప్రధాని మోదీ పర్యటనకు చైనా ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికింది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశంగా చైనా భావిస్తోంది. ఎస్‌సీఓ సమావేశం సందర్భంగా పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు ఇతర ప్రపంచ నేతలతో మోదీ భేటీ కానున్నారు.

సత్య నాదెళ్లను హెచ్చరించిన మస్క్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI తాజాగా తీసుకొచ్చిన GPT-5 అధికారిక ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఓపెన్‌ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.

ఆసియా కప్‌లో భారత్ Vs పాక్ మ్యాచ్ రద్దు అవుతుందా..?

ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి యూఏఈలో ప్రారంభమవుతుంది. బీసీసీఐ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమైనప్పటికీ.. ఈ లీగ్‌లోని హై-వోల్టేజ్ యుద్ధం సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. కానీ ఈ టోర్నమెంట్‌లో టీమిండియా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుందా అనేది పెద్ద ప్రశ్న? ఆసియా కప్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. ప్రభుత్వ అనుమతి ముందుగానే తీసుకుంటారని.. మ్యాచ్ జరిగే […]

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్….రీపోస్టింగ్ బటన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్‌ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

కుప్పకూలిన ఘనా హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం

ఘనా దేశంలో ఘోరమైన సైనిక హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 6, బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ మిలిటరీ హెలికాప్టర్ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీ తో సంబంధం కోల్పోయింది. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.

ఐర్లాండ్‌లో భారత సంతతి చిన్నారిపై జాత్యహంకార దాడి

ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యహంకార దాడి జరిగింది. బాలికపై ఆమె ఇంటి సమీపంలో కొందరు దుండగలు దారుణంగా దాడి చేసి.. “భారతదేశానికి తిరిగి వెళ్ళిపో” అంటూ బెదిరించారు. చిన్నారి ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కొంతమంది అబ్బాయిలు, ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఓ అమ్మాయి దాడి చేసినవారిలో ఉన్నారని తెలిపింది.

సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపు- TCS

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 1 నుండి జీతాలు పెంచుతున్నట్లుగా ఉద్యోగులకు మెయిల్స్ పంపుతోంది. ఈ జీతాల పెంపులో సుమారు 80 శాతం మంది ఉద్యోగులు ఉంటారని, ముఖ్యంగా జూనియర్, మిడ్-లెవెల్ ఉద్యోగులకు  వర్తిస్తుందని టీసీఎస్ వెల్లడించింది. 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన కొన్ని రోజులకే టీసీఎస్ ఈ జీతాల పెంపు ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్యతో కంపెనీ తన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలని […]

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌..

వాట్సాప్ తాజాగా తీసుకవచ్చిన “సేఫ్టీ ఓవర్‌వ్యూ (Safety Overview)”అనే ఫీచర్ ను తీసుకవచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారునికి తమను ఎవరు గ్రూప్‌లో జోడించారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు గ్రూప్‌కి జోడిస్తే అప్రమత్తం చేస్తుంది. గ్రూప్ గురించి సమాచారంతో పాటు, సురక్షితంగా ఉండటానికి చిట్కాలు కూడా అందిస్తోంది. అలాగే, గ్రూప్‌లో ఎవరైనా సభ్యుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారో లేదో కూడా మీరు చూడగలరు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON