loader

గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపీ లేకుండా దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే గాజా సిటీ మొత్తం పాడైపోయింది. అక్కడి ప్రజలు ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ మళ్లీ గాజ-పై (Gaza) దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన దాడుల్లో సుమారుగా 47మంది పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడులు ఇంకా పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.

ఒకే వేదికపై జిన్, కిమ్, పుతిన్.. ట్రంప్ ఉక్రోశం

చైనాలో విక్టరీ డే పరేడ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని బీజింగ్ వేదికగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైనిక ప్రదర్శనను చైనాఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో కలిసి వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర […]

ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి సేవలకు అంతరాయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం గత 20 నిమిషాలుగా వందలామాది చాట్ జిపిటి వినియోగదారులు తమ సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారని తెలిపింది.

భారత్ పై ట్రంప్ మరో దెబ్బ.. ఫార్మాపై డబుల్ టారిఫ్ లు

భారత్ పై అమెరికా అధ్యక్షుడు అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలను విధించాలని డిసైడ్ అయ్యారు. దాదాపు జెనరిక్ మెడిసిన్స్ తో సహా మొత్తం సరుకు అక్కడికే వెళుతుంది. భారత్ ఎగుమతులను ఆపేస్తే యూఎస్ (US) కు ఆ మందులు దొరక్క నానా కష్టాలు పడాల్సిందే. 200 శాతం టారిఫ్ ల వల్ల భారత్ కు ఎంత నష్టమో అమెరికాకు కూడా […]

మోదీ.. జిన్‌పింగ్‌, పుతిన్‌ను కలవడం సిగ్గుమాలిన చర్య..

భారత్ పై మరోసారి అమెరికా నోరు పారేసుకుంది. మోదీ.. జింపింగ్, పుతిన్‌లు కలవడం ఒక సిగ్గుమాలిన చర్య అని అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో స్పందించారు. మోదీ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్లి ఇద్దరు డిక్టేటర్లను కలవడం ఏంటి? ఎప్పటికైనా మోదీ అమెరికాతోనే స్నేహం చేయాలి. రష్యా.. చైనాతో కాదు అని పేర్కొన్నారు. మొత్తానికి మోదీని నియంతల హగ్గర్‌ అని కూడా పిలిచారు.  ఇదో పెద్ద సిగ్గుచేటుగా […]

చైనా పర్యటన.. బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ రైల్లో చైనా పర్యటనకు వెళ్లారు. తన ప్రత్యేకమైన ప్రేవేటు రైల్లో ఆయన సోమవారం సాయంత్రం చైనాకు బయలుదేరారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 80 సంవత్సరాలు అయిన నేపథ్యంలో చైనాలో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన నేటి సాయంత్రం అక్కడకు చేరుకుంటారు.

సూడాన్‌లో విరిగిపడ్డ కొండచరియలు..1000 మందికిపైగా మృతి

సూడాన్‌లో కొండచరియలు విరిగి పడటంతో సుమారు 1000 మందికిపైగా మరణించారని తెలుస్తోంది. సూడాన్ దేశంలోని పశ్చిమ ప్రాంతమైన డార్ఫర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వల్ల ఒక ఊరంతా నేలమట్టం అయింది, కొండచరియలు విరిగిపడటం వల్ల డార్ఫర్‌లో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడని తెలిపింది. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సూడాన్‌ లిబరేషన్‌ మూమెంట్‌/ఆర్మీ ప్రకటించింది.

భారత్ పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్

దశాబ్దాలుగా భారత్ అమెరికాకు భారీగా సరుకులు అమ్ముతున్నా, అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా ఒకవైపు వాణిజ్యం అని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ విధిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా కంపెనీలు భారత మార్కెట్‌లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. భారత్‌లో వ్యాపారం చేయడం చాలా కష్టతరమైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

తింజియన్ షాంఘై సహకార సదస్సు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారంనాడు ఒకే కారులో ప్రయాణించారు. ‘ఎస్‌సీఓ సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి ఒకే కారులో ద్వైపాక్షిక భేటీ వేదికకు చేరుకున్నాం. ఇద్దరి మధ్య ఎప్పుడూ చాలా లోతైన చర్చలు ఉంటాయి’ అని మోదీ తెలిపారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

చైనా శిఖరాగ్ర సదస్సులో.. ముగ్గురు దేశాధినేతల బిగ్‌ షేక్‌హ్యాండ్‌

చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ SCO ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా సదస్సు మూడు దేశాల అధినేతలు షెక్యాండ్‌ ఇచ్చుకొని, ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోదీ రష్యా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON