సూడాన్‌లో కొండచరియలు విరిగి పడటంతో సుమారు 1000 మందికిపైగా మరణించారని తెలుస్తోంది. సూడాన్ దేశంలోని పశ్చిమ ప్రాంతమైన డార్ఫర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వల్ల ఒక ఊరంతా నేలమట్టం అయింది,
కొండచరియలు విరిగిపడటం వల్ల డార్ఫర్‌లో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడని తెలిపింది. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సూడాన్ లిబరేషన్ మూమెంట్/ఆర్మీ ప్రకటించింది.

