loader

నేపాల్ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణం

నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సోమవారం నియమితులైన ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురిని కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(73) తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కర్కి నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమె కుల్మాన్ ఘీసింగ్, రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాశ్ ఆర్యల్‌ను మంత్రులుగా చేర్చుకున్నారు.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. ఢిల్లీకి అమెరికా బృందం!

భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రతినిధి బృందం భారత్‌లో అడుగుపెట్టనుండగా, రేపటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోనున్నారు. భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్‌తో బ్రెండన్ లించ్.. చర్చలు జరపనున్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చర్చలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్తాయో వేచి చూడాలి.

బ్రిటన్లో ముగ్గురు పిల్లల చావుతో రగులుతున్న నిరసన జ్వాలలు

వాయువ్య ఇంగ్లాండ్ లోని సౌత్పోర్ట్లోని ఓ డ్యాన్స్ స్కూల్లో దుండగులు కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు పిల్లలు మరణించిన ఘటనతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారకులు వలసదారులేనని అనుమానిస్తూ, వలస వ్యతిరేక వర్గాలు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారి, దోపిడీలు, విధ్వంసానికి దారితీశాయి. లివర్పూల్, బ్రినటల్, బ్లాక్ పూల్, హల్, మాంచెస్టర్ వంటి అనేక నగరాల్లో ఆందోళనలు, పలు చోట్ల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ను […]

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు

ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం డ్రోన్లు, బాంబులు ఉపయోగించి గాజాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో 32 మంది చనిపోయినట్లు సమాచారం, వీరిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఇజ్రాయెల్‌ టెల్‌ అవీవ్‌ నిఘా పరికరాలు హమాస్‌ భవనాల్లో ఉంచారని ఆరోపిస్తూ, ఆ భవనాలను ధ్వంసం చేస్తోంది. IDF ఇప్పటికే స్థానిక పౌరులకు గాజా నగరాన్ని ఖాళీ చేయమని హెచ్చరించింది,

మహిళా సాధికారికత… నేపాల్ ప్రధాని సుశీలా కార్మికి మోడీ శుభాకాంక్షలు

మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు ప్రత్యేకతల బంధం ఉందని చెప్పారు. నేపాల్‌లో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు స్వీకరించడం నేపాల్ మహిళా సాధికారికత వెల్లివిరిసిన ఘట్టానికి తార్కాణం అన్నారు. నేపాల్ పరివర్తన దశలో భారత్ ఎల్లవేళలా తోడుగా నిలిచిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రధాని గుర్తు చేశారు.

నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఏపీ వాసులు

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నారా లోకేష్ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ముందుగా నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులతో కమ్యూనికేట్ అయి.. వారందర్నీ ఖాఠ్మాండూ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తీసుకు వచ్చారు. 144 మందితో విమానం బయలుదేరుతున్న వీడియోను నారా లోకేష్ షేర్ చేసారు. ఇండిగో విమానం విశాఖపట్నం , తిరుపతికి బయలుదేరింది. 36 గంటల కృషితో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం విలువైనదిగా చేసిందన్నారు.

దుబాయ్‌లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రారంభం

ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన కొత్త క్యాంపస్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం (సెప్టెంబర్ 11) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతీయ విద్య ప్రపంచీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి […]

ఇంటర్నెట్‌ను దున్నేస్తున్న నానో బనానా – గూగుల్ జెమినీ

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వైరల్‌గా మారింది. “నానో బనానా” అనేది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ AI టూల్‌కు ఇంటర్నెట్ వాసులు పెట్టిన ఫన్నీ డాక్‌నేమ్. ఈ టూల్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లు లేదా ఫోటోల ఆధారంగా అత్యంత వాస్తవికమైన 3D ఫిగరిన్‌లను సృష్టిస్తుంది. ఈ ఫిగరిన్‌లు చిన్న ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తాయి. కలెక్టబుల్ టాయ్‌లను పోలి ఉంటాయి. పెంపుడు జంతువులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, లేదా మీ స్వంత ఫోటోను కూడా ఈ టూల్ […]

ట్రంప్ డబుల్ గేమ్.. దాడి మొదలైన తర్వాత అమెరికా నుంచి ఫోన్ !

హమాస్ నేతలే లక్షంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ ఖతార్‌కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారనే భావన మొదలైంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్‌అల్‌హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. దీని గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని టెల్ అవీవ్ చెప్పింది. యూఎస్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON