‘రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్టు కొన్ని నివేదికలు మా దృష్టికి వచ్చాయి. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండండి. అది చాలా ప్రమాదకరం. రష్యా సైన్యంతో కలిసి పని చేయడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఎవరూ రష్యా సైన్యంలో చేరకండి. వారి కుటుంబాలను కూడా సంప్రదిస్తున్నామ’ని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది రకరకాల ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో పనుల పేరుతో చాలా మంది భారతీయులను రష్యాకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారిని బలవంతంగా యుద్ధరంగంలోకి దింపుతున్నారు

