loader

అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ బాంబార్డియర్ సీఆర్జే-900 విమానం ప్రమాదానికి గురైంది. రన్ వే పై అదుపు తప్పి ఓ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 13 మంది చిన్నారులతో సహా 64 మంది దుర్మరణం

సుడాన్ దేశంలో మానవత్వం మంటగలిసేలా జరిగిన ఆసుపత్రి దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పారామిలిటరీ దళాలు, ఆర్మీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధం చివరకు పసిపిల్లలు, వైద్యులను బలితీసుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మృతుల్లో ఇద్దరు మహిళా నర్సులు, ఒక డాక్టర్ కూడా ఉన్నారని సమాచారం. ఆసుపత్రిలోని పిల్లల విభాగం, ప్రసూతి వార్డు, అత్యవసర విభాగం ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనివల్ల ఆసుపత్రి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇప్పుడు కీలకంగా మారింది.తమ దేశంలో ఏ ఒక్క విద్యుత్ ప్లాంట్ పై అయినా అమెరికా దాడి జరిగిన మరుక్షణమే హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము వెనడుగు వేయబోమని, ట్రంప్ బెదిరింపులక లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీనివల్ల భారత్ సహా ఇతర మిత్రదేశాలకు అరకొరగా సాగుతున్న ఇంధన రవాణా సైతం పూర్తిగా స్తంభించిపోతుంది

“లిటిల్ ఇండియా” పై ఇరాన్ భీకర దాడి- ఇజ్రాయెల్ డిఫెన్స్ లెస్

ఇరాన్ భీకర దాడికి దిగింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ డిమోనాపై క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా.. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ గా పేరుంది. లిటిల్ ఇండియాగా పిలుస్తారీ పట్టణాన్ని. ఆ దేశ అణ్వాయుధ కార్యకలాపాలకు ప్రాంతాన్ని గుండెకాయగా భావిస్తారు. నేరుగా ఇరాన్ ఈ టౌన్ పైనే దృష్టి సారించింది. మిస్సైళ్లను సంధించింది. వీటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎందుకు ఇంటర్ సెప్ట్ కాలేకపోయిందనేది సవాలక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గల ఇజ్రాయెల్.. […]

ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఇరాన్

ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై ఈ క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్ నతాంజై దాడుల ప్రతీకారంగానే తాజాగా టెహ్రాన్ ఈ దాడులు […]

హర్మూజ్ ను 48 గంటల్లో తెరవాల్సిందే- లేదంటే : ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్

హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేకపోతే ఇరాన్‌పై దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్‌లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆదివారం పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పటికే ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు అమెరికా ప్రకటించగా అందులో ఎలాంటి వాస్తవం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన ఇరాన్.. జెరూసలెంను తాకిన మిసైల్..

శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిసైల్స్, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. పవిత్ర రంజాన్ రోజు ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా అల్ అక్సా మసీదుకు కొద్దిదూరంలో ఈ మిసైల్ దాడి జరిగింది. దీంతో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిలిపేయాల్సి వచ్చింది. . రంజాన్ సందర్భంగా ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా ముస్లింలు, క్రిస్టియన్స్, యూదుల పవిత్ర స్థలాలకు కొద్దిదూరంలో ఈ దాడి జరిగింది. ఇదీ ముల్లాల నిజ స్వరూపం’ […]

నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్!

ఇరాన్ దేశంలోని అత్యంత సురక్షితమైన, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా భారీ బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ పేలుళ్ల శబ్ధం చాలా కిలోమీటర్ల వరకు వినిపించిందని..ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న నిరంతర పోరులో భాగంగానే ఈ తాజా సైనిక చర్య జరిగినట్లు తెలుస్తోంది.ప్రాథమిక విచారణలో అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదని ధ్రువీకరించారు

దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక కారు విడిభాగాల తయారీ కర్మాగారంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఊహించని విధంగా సంభవించిన భారీ పేలుడుతో ఫ్యాక్టరీ ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. ఈ ప్రమాదం వల్ల భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. కర్మాగారంలో పని జరుగుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించడంతో కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 59 మంది తీవ్రంగా […]

పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తాం: ఇరాన్

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్‌లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్‌పై దాడులు చేస్తామని ఇరాన టాప్‌ మిలిటరీ కమాండర్‌ జనరల్‌ షెకార్చి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్‌ ఈస్ట్‌లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకట్టే ప్లాన్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌ నివాస సముదాయాలనూ టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. బాగ్దాద్‌లోని అమెరికన్‌ ఎంబసిపై మరోసారి దాడులు చేశారు. ఇరాన్‌ మిస్సైళ్లతో విరుచుకుపడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON