loader

దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మొదటగా MH-60R సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో కుప్పకూలింది.పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, సాధారణ ఆపరేషన్ల సమయంలో జరిగిన ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు

రష్యా బూరెవెస్ట్‌నిక్‌ క్షిపణి పరీక్ష – అమెరికాకు మరో హెచ్చరిక!

రష్యా ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ప్రకారం, రష్యా సైన్యం తాజాగా ‘బూరెవెస్ట్‌నిక్‌’ (Burevestnik) అనే సరికొత్త అణు శక్తితో నడిచే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సుదీర్ఘ దూరాలపై దాడి చేసే సామర్థ్యం కలిగి ఉందని, అణు ఇంధనంతో నడుస్తుందని రష్యా వెల్లడించింది. ఈ క్షిపణి 15 గంటలపాటు గాల్లోనే ఉండి, దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ ప్రదర్శన అమెరికా మరియు నాటో దేశాలకు స్పష్టమైన […]

సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి…

ఫ్రెంచ్‌ సైక్లిస్ట్‌, టిక్‌టాక్‌ స్టార్‌ అరోలియాన్‌ ఫాంటోనోయ్‌ మామూలోడు కాదు… సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలాంటి ఫీట్స్‌ సాధించడం ఫాంటోనోయ్‌కు కొత్తేమీ కాదు. 2021లో ప్యారిస్‌లోని ట్రినిటీ టవర్‌, ఈ ఏడాది ఎస్టోనియాలోని టాలిన్‌ టీవీ టవర్‌ను సైకిల్‌పై అలవోకగా ఎక్కి ‘ఔరా’ అనిపించాడు.

స్టెప్పులతో ఇరగదీసిన ట్రంప్.. మలేసియా రెడ్ కార్పెట్‌ వెల్కమ్‌లో డాన్స్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలేసియాలో ఆసియాన్ సదస్సుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. ఆదివారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మలేషియాలో అడుగుపెట్టగానే ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. మలేషియన్‌ సంప్రదాయ నృత్య కళాకారుల బృందంతో కలిసి సాంప్రదాయ నృత్యం చేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ట్రంప్ తనదైన స్టయిల్‌లో […]

రహస్య సమావేశం, CIA కుట్ర, US ఆఫీసర్ హత్య

బంగ్లాదేశ్‌లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్(Terry Jackson) హత్య అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటన చుట్టూ తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం, CIA భారత ప్రధానమంత్రి మోదీని హత్య చేయాలని కుట్ర పన్నిందని, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకే భారత్, రష్యా సంయుక్తంగా చర్యలు తీసుకున్నాయని కథనాలు చెబుతున్నాయి. ఈ హత్యపై అమెరికా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలు విడుదల చేసినప్పటికీ, కుట్రల వాదనలు తగ్గడం లేదు.

రూ.855 కోట్లతో ‘రిలయన్స్​ ఏఐ వెంచర్’​- అందులో ఫేస్​బుక్​ వాటా 30 శాతం

ఇండియన్ బిలియనీర్​ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఇప్పుడు కృత్రిమ మేధ సేవల (ఏఐ సర్వీసులు)పై దృష్టి కేంద్రీకరించింది. రిలయన్స్​ ఎంటర్​ ప్రైజెస్​, మెటాకు చెందిన అనుబంధ సంస్థ ఫేస్​బుక్​ ఓవర్సీస్​, ఐఎన్​సీ కలిసి ఈ జాయింట్​ వెంచర్​ను ప్రారంభించనున్నాయి. రూ.855 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న ఈ జాయింట్ ఏఐ వెంచర్​లో రిలయన్స్ ఎంటర్​ప్రైజెస్​​ 70 శాతం వాటా కాగా, మెటా అనుబంధ సంస్థ అయిన ఫేస్​బుక్​ ఓవర్సీస్​ 30 శాతం వాటాను కలిగి ఉంటాయని […]

భారత్‌లో జమ్మూ-కాశ్మీర్ అంతర్భాగమే.. హరీష్

యూఎన్‌(UNO)లో పాకిస్తాన్‌పై మరోసారి ధ్వజమెత్తారు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. జమ్మూకాశ్మీర్‌ భారత్‌లో ఎల్లప్పుడూ అంతర్భాగమేనని..విడదీయరాని బంధంగా ఉందని.. ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆ్రమించిన ప్రాంతాల్లో విరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని…దానిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ సైనిక ఆక్రమణ, అణిచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని హరీష్ కోరారు.

సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ

సౌదీలో కఫాలా వ్యవస్థను 1950లో ప్రారంభించారు. దీని గురించే తెలిసే కార్మికులు అక్కడికి వెళతారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదా కఫాలా వ్యవస్థదారుల చేతిలోనే ఉంటుంది. సౌదీలో పని చేసేవారు అక్కడికి వెళ్ళగానే తమ పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించాల్సి ఉంటుంది. కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్ళాలన్నా యజమాని అనుమతి ఇవ్వాల్సిందే ఇప్పటికే దీన్ని ఇజ్రాయెల్, బహ్రెయిన్ లు రద్దు చేశాయి. కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్లో వివిధ రూపాల్లో ఇంకా కొనసాగుతోంది.

కొత్త తరానికి మార్గదర్శకత్వం వహించేలా లీప్ విధానం: నారా లోకేశ్

ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Astrade) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నాం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

పాక్‌-అఫ్ఘాన్‌ బార్డర్‌ క్లోజ్‌.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు..

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్‌, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. పాక్‌- అఫ్గాన్‌ మధ్య ఏటా 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని. అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా  5వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు  దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON