loader

భారత్‌నే లక్ష్యంగా చేసుకున్న ఓపెన్‌ఏఐ..నియామకాలు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) విప్లవానికి మార్గదర్శకంగా నిలిచిన చాట్‌జీపీటీ మాతృసంస్థ OpenAI ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్‌ఏఐ అధికారికంగా భారత్‌లో బ్రాంచ్‌ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం సొల్యూషన్‌ ఇంజనీర్‌ల నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బెంగళూరును కేంద్రంగా చేసుకుని, భారత డెవలపర్‌ కమ్యూనిటీలతో సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ భాగస్వామ్యాలను పెంచడం సంస్థ తదుపరి లక్ష్యమని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నారాయణన్‌ వివరించారు.

భారతీయ హిందువులను.. వెనక్కి పంపిన పాక్‌

సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556 జయంతి నేపథ్యంలో జన్మస్థలమైన పాకిస్థాన్‌ సరిహద్దులోని నంకనా సాహిబ్‌ను సందర్శించేందుకు సుమారు 2,100 మంది భారతీయులకు అనుమతి పత్రాలను పాకిస్థాన్‌ జారీ చేసింది. పాకిస్థాన్‌లో జన్మించిన సింధీలైన 14 మంది హిందువులు భారత పౌరసత్వం పొందారు. పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు తగిన ప్రతాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు. అయితే ‘మీరు సిక్కులు కాదు హిందువులు’ అని పాక్‌ అధికారులు వారిని అవమానించారు.

భూకంపం నుంచి కోలుకోకముందే ఫిలిప్పీన్స్‌లో వరదలు బీభత్సం..

ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్‌ అల్లాడిపోతోంది. గతనెల వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి కోలుకోక ముందే కల్మేగీ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.  ఈ తుఫానుకు సెబు ప్రావిన్స్‌ అత్యంత ప్రభావితమైంది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు ఇప్పటి వరకూ దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ వరదల్లో 26 మంది గల్లంతయ్యారు.

గవర్నర్ మేయర్ ఎన్నికల్లో ట్రంప్ కు బిగ్ షాక్

అమెరికా రాజకీయాల్లో మరోసారి భారత సంతతి ప్రతిభ దూసుకుపోయింది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయాన్ని సాధించగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భారతీయ మూలాల అభ్యర్థుల గెలుపు. న్యూయార్క్‌లో 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. వర్జీనియాలో గజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో జెజె సింగ్ కూడా గెలిచి భారత సంతతికి మరో గౌరవాన్ని తీసుకువచ్చారు.

అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ..

వర్జీనియా స్టేట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా భారత సంతతి మహిళా నేత గజాలా హష్మీ విజయం సాధించారు. ట్రంప్‌కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా.. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన ముస్లిం మహిళగా గజాలా హష్మీ చరిత్ర సృష్టించారు గజాలా 1964న హైదరాబాద్‌  మలక్‌పేటలో జన్మించారు. ఆమెకు నాలుగు సంవత్సరాల వయసులో ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఆమె తాత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ […]

అమెరికాలో కూలిన విమానం: ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కెంటకీలోని లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయిఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో పలు భవనాలు దగ్దమయ్యాయి. విమానంలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి.కార్గో విమానం 42వేల గ్యాలన్లు జెట్ ఇంధనాన్ని మోసుకెళ్తోన్న తెలుస్తోంది

43ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తికి ఊరట

1980లో స్నేహితుడు హత్య కేసులో చేయని నేరానికి 43 ఏళ్ల పాటు అమెరికాలో జైలు శిక్ష అనుభవించి విడుదలైన భారత సంతతి వ్యక్తి సుబ్రమణ్యం వేదం(64) ఊరట లభించింది. ఆయనను దేశం నుంచి బహిష్కరించవద్దని ఇమిగ్రేషన్​ అధికారులకు అమెరికాకు చెందిన రెండు న్యాయమస్థానాలు ఆదేశించాయి. ప్రస్తుతం ఆయన లూసియాలనాలోని ఓ నిర్భంధ కేంద్రంలో ఉన్నారు. ప్రస్తుతం తిరిగి భారత్​కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

షట్‌డౌన్‌తో సిబ్బంది కొరత.. అమెరికాలో స్తంభించిన విమాన సేవలు

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఆదివారం ఒక్క రోజే దాదాపు 5 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అమెరికా మీడియా నివేదించింది. సోమవారం మధ్యాహ్నానికి 2,530కి పైగా విమానాలు ఆలస్యం కాగా, 60కి పైగా సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లాస్‌ఏంజిల్స్‌, కాలిఫోర్నియా, చికాగో, వాషింగ్టన్‌, న్యూజెర్సీ, న్యూయార్క్  నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి […]

టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ కు పోటీగా కొత్త యాప్

వీరీల్స్(vreels) ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్ గా మారే అవకాశం ఉంది. చాట్స్, కాల్స్ కనెక్ట్ అయ్యేందుకు.. స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్ లు అవసరం లేదు. వీరీల్స్ లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేయడం విశేషం. ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON