సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556 జయంతి నేపథ్యంలో జన్మస్థలమైన పాకిస్థాన్ సరిహద్దులోని నంకనా సాహిబ్‌ను సందర్శించేందుకు సుమారు 2,100 మంది భారతీయులకు అనుమతి పత్రాలను పాకిస్థాన్ జారీ చేసింది. పాకిస్థాన్‌లో జన్మించిన సింధీలైన 14 మంది హిందువులు భారత పౌరసత్వం పొందారు. పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు తగిన ప్రతాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు. అయితే ‘మీరు సిక్కులు కాదు హిందువులు’ అని పాక్ అధికారులు వారిని అవమానించారు.

