loader

చైనా పాస్‌పోర్ట్‌కు అప్లై చెయ్.. 18 గంటల పాటు భారతీయ మహిళ నిర్భంధం..

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో సుదీర్ఘంగా నిర్బంధించి, వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించారు. దానితో “అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా దేశంలో భాగం. కాబట్టి మీ భారతీయ పాస్‌పోర్ట్ చెల్లదు” అని వారు స్పష్టం చేశారు. చివరకు దౌత్య అధికారుల జోక్యంతో నిర్భంధం నుంచి ఆమె బయటపడింది. ఈ క్రమంలో బాధిత మహిళ ప్రధాని మోదీకి […]

పక్క దేశంలోనూ పరువు తీస్తున్నారు.. భారతీయ వ్యక్తిని బహిష్కరించిన కెనడా

ఒంటారియోలో తన మనవడి దగ్గరికి విజిటర్ వీసాపై కెనడాకు వెళ్లిన 51 ఏళ్ల భారతీయ వ్యక్తి, ఓ స్కూల్‌ ముందు ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతన్ని కెనడా నుంచి బహిష్కరిస్తూ తీర్పు ఇచ్చింది. సింగ్ పాఠశాల పక్కనున్న ఒక కొట్టు దగ్గరకు వెళ్లి తరచూ సిగరెట్‌ కాల్చుతుండేవాడు.. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కెనడియన్ బాలికలు, యువతులపై వేధింపులకు పాల్పడేవాడని. వారితో డ్రగ్స్, మద్యం గురించి […]

ఉగాండాలో DNA పరీక్షల సంచలనం. షాకవుతున్న తండ్రులు.

ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక మంది పురుషులు తమ పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు.. అందులో 98 శాతం మందికి, ఆ పిల్లలకు తాము తండ్రులం కాదని తెలిసి షాక్‌కు గురవుతున్నారు. పురుషుల్లో సంతాన సమస్య వున్నా, మహిళ సంతానం ఇవ్వడంలో విఫలమైతే, విడాకులు లేదా బహిష్కరణ వంటి ఆఫ్రికన్ సంప్రదాయాల కారణంగా మహిళలు వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి ఇతరుల ద్వారా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారని ఒక అధికారి […]

పాకిస్థాన్.. పారామిలటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మహుతి దాడి

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఉదయం భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ.. ఉగ్రవాదులు ఫ్రంటియర్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంపై భారీ ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా పారామిలటరీ కార్యాలయం ప్రధాన గేట్, సైకిల్ స్టాండ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. రెండు వరుస పేలుళ్ల తర్వాత.. ఉగ్రవాదులు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు.

గ్లోబల్ సౌత్, సంపన్న దేశాల పర్యావరణ హామీలపై ప్రధాని మోదీ గళం

డెక్కన్ సూత్రాల ప్రకారం ఆహార భద్రతపై జీ20 కూటమి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌‌లో జరుగుతున్న జీ20 సదస్సు – 2025 వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు హామీలకు కట్టుబడి పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక వనరులను సకాలంలో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వేదికల్లో వాణిని వినిపించేలా గ్లోబల్ సౌత్‌కు సముచిత స్థానాన్ని కల్పించాలన్నారు.

అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్… 1800 మంది ఇంజనీర్ల తొలగింపు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. గత నెలలో భారీగా లేఆఫ్స్‌ (Layoffs) ప్రకటించిన అమెజాన్, మరోసారి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌లోని క్లౌడ్‌ సర్వీసెస్‌, డివైజెస్‌, రిటెయిల్‌, అడ్వర్టైజింగ్‌, గ్రాసరీస్‌ విభాగాల్లోని ఉద్యోగాలు పోతున్నాయి. ఇంజనీర్ల బృందంపై ఈ లేఆఫ్ ప్రభావం తీవ్రంగా ఉంది. న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్ ప్రకారం.. ఆ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం […]

సమగ్ర మానవత్వంతోనే ప్రపంచ అభివృద్ధి: జీ20 సదస్సులో ప్రధాని మోదీ

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచాభివృద్ధికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ఆఫ్రికా తొలిసారిగా జీ20 సదస్సు నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం సరైన సమయమని, ఈ సందర్భంగా అభివృద్ధి కొలమానాలను పునఃపరిశీలించి, సమగ్రమైన, స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా ‘సమగ్ర మానవత్వం’ (Integral Humanism) సూత్రం దీనికి సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.

అవార్డు అందుకుంటే నోబెల్ గ్రహీత జైలుకే..

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న వెనిజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ప్రస్తుతం మరియా దేశంలో లేరని, ఇప్పటికే ఆమెపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం […]

‘మీరంతా 2 దేశాల మధ్య వంతెన వంటివారు’- ప్రవాస వ్యాపారులతో ప్రధాని మోదీ​

దక్షిణాఫ్రికాలోని భారత సంతతికి చెందిన టెక్‌ వ్యాపారులతో, భారతీయ సంఘ ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌తో తమ అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జీ 20 నేతల సదస్సులో పాల్గొనడాని కిజొహన్నెస్‌బర్గ్‌ వెళ్లిన మోదీ, భారత సంతతికి చెందిన వారితో జరిగిన సమావేశాన్ని ఫలప్రదమైనదని వర్ణించారు. భారత్‌తో అనుబంధాన్ని మరింతగా పెంచి, తమ ప్రజలతో సన్నిహితంగా పనిచేయండని ప్రధాన మంత్రి వారికి సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON