దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచాభివృద్ధికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ఆఫ్రికా తొలిసారిగా జీ20 సదస్సు నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం సరైన సమయమని, ఈ సందర్భంగా అభివృద్ధి కొలమానాలను పునఃపరిశీలించి, సమగ్రమైన, స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా ‘సమగ్ర మానవత్వం’ (Integral Humanism) సూత్రం దీనికి సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.

