loader

జోహన్నెస్‌బర్గ్‌లో కాల్పుల కలకలం… బార్‌పై దాడి-9 మంది మృతి

జోహన్నెస్‌బర్గ్‌ నగరానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారు గనుల ప్రాంతంలోని బెకర్స్‌డాల్‌లోని టావెర్న్‌పై (బార్) దాదాపు డజను మంది వ్యక్తులు దాడి చేశారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్టుగా తొలుత పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మృతుల సంఖ్యను 9గా తెలిపారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత పారిశ్రామిక దేశమైన దక్షిణాఫ్రికా… వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ల ద్వారా నడిచే నేరాలు, […]

తైపీలో దుండగుడి బీభత్సం.. 14 మందికి కత్తిపోట్లు

తైవాన్‌ రాజధాని తైపీలో ఓ దుండగుడు శుక్రవారం సాయంత్రం పొగ బాంబులు విసురుతూ, ఎదురుపడిన వారినల్లా కత్తితో పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. తైపీ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ సమీపంలోగల సబ్‌వే వద్ద ప్రయాణికులపై దాడికి దిగాడు. దుండగుడి దాడిలో మొత్తం 14 మంది కత్తిపోట్లకు గురయ్యారు. వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగతా 11 మంది చికిత్స పొందుతున్నారు. కాగా దాడి అనంతరం దుండగుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ఎత్తయిన భవనం పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. .

‘సంప్రదాయ వైద్యంతో అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారం’- భారత్​పై WHO చీఫ్ ప్రశంసలు

సంప్రదాయ వైద్యం ఆధునిక జగతి ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యల  పరిష్కారానికి సాయపడగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌ఓ)  డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. సైన్స్, సంప్రదాయ  వైద్యం ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తాయని భారత్‌ ప్రపంచానికి చాటిందని వెల్లడించారు. దిల్లీలో సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ లో టెడ్రోస్ అథనామ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా-2 కేసులో భారీ శిక్ష పడింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు శనివారం వీరిద్దరికీ 17 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. తోషాఖానా-2 కేసు ప్రభుత్వ బహుమతులకు సంబంధించినది. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలు నిబంధనలకు విరుద్ధంగా ఒక ఖరీదైన బుల్గారీ జ్యువెలరీ సెట్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం […]

“అమెరికా దాటి వెళ్లకండి”: వీసా జాప్యం నేపథ్యంలో ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

టెక్ దిగ్గజం గూగుల్ తన విదేశీ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా వీసాపై పనిచేస్తున్న సిబ్బంది ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది. అమెరికా ఎంబసీల్లో వీసా ప్రాసెసింగ్‌లో విపరీతమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులు విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా అమెరికాలో హెచ్-1బి, ఎల్-1 వంటి వీసాలపై పనిచేసే వేలాది మంది భారతీయులతో పాటు ఇతర దేశస్థులు పండుగ సెలవులకు లేదా […]

సిరియాపై అమెరికా దాడులు!

సిరియాలోని ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో ప్రతీకార దాడులు నిర్వహించింది. ఇటీవల జరిగిన దాడులకు ప్రతిగా ఈ సైనిక చర్య చేపట్టినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. విమాన దాడులు, క్షిపణి దాడుల ద్వారా ఐసిస్‌కు చెందిన శిబిరాలు, ఆయుధ గిడ్డంగులు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఐసిస్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి.

సతాయిస్తున్న యూట్యూబ్, వీడియో ప్లే చేయలేక యూజర్ల ఇక్కట్లు.!

ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector నుంచి యూజర్లు ఈ సమస్య గురించి విపరీతంగా రిపోర్ట్ అందించారు. యూట్యూబ్ డౌన్ గురించి శుక్రవారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి. అయితే, ఇది రెండు నిమిషాల్లోనే వేల సంఖ్యలో యూజర్లు ఈ సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ […]

ప్రధాని మోదీ చెవికి పోగు.. ఒమన్ పర్యటన వీడియో వైరల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ చెవికి ఒక రింగ్ లాంటి పరికరం కనిపించింది. అది ఏంటి అని నెటిజన్లు.. సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అది ఒక ట్రాన్స్‌లేషన్ పరికరం అని తేలింది. అంటే ప్రధాని మోదీతో మాట్లాడేవారు ఏ భాష మాట్లాడినా అది ఆయనకు అర్థం అయ్యే భాషలో వినిపించే పరికరం. అది ఒక రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్ అని సంబంధిత […]

ఒమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమాన్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమాన్ (ఫస్ట్ క్లాస్)’ను ప్రదానం చేసింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ, ఇప్పటివరకు 29 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది భారత్–ఒమాన్ ప్రజల మధ్య ఉన్న అనురాగం, నమ్మకానికి ప్రతీక అని […]

భారత్‌ను రెచ్చగొడుతూ.. హిందూ వర్కర్‌ను చెట్టుకు వేలాడదీసి తగులబెట్టిన బంగ్లా మూక..!

బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందూ వర్కర్‌పు అత్యంత దారుణంగా హింసించి చెట్టుకు కట్టేసి తగులబెట్టి చంపేశారు. హదీ హత్య తర్వాత ఢాకాలో నిరసనలు మిన్నంటాయి. ఒకవైపు భారత్‌ను రెచ్చగొడుతూ.. అక్కడి హిందువులపై దారుణానికి ఒడిగడుతున్నారు. హిందువు అయిన ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్ పై ఓ గుంపు దాడి చేసి తమ ప్రవక్తను అవమానించాడు అనే ఆరోపణలు చేస్తూ అతనిపై పదుల సంఖ్యలో విరుచుకుపడ్డారు. ఆపై మృతదేహాన్ని ఢాకా మేమైన్‌ సింగ్‌ మైమేన్ సింగ్ హైవే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON