loader

కెనడాలో భారతీయ మహిళ హత్య.!

కెనడాలోని టొరంటోలో హిమాన్షీ ఖురానాఅనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఖురానాపై తొలుత లైంగిక దాడి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు..ఆపై హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా..ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న గఫూరీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

పండగ పూట యుద్ధం వద్దు

క్రిస్మస్ సందర్భంగా కాల్పుల విరమణకు రష్యా నిరాకరించడంపై పోప్ లియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాంతి, మానవతా విలువలకు ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన అసిస్టెడ్ డైయింగ్ చట్టంపై కూడా పోప్ లియో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం మానవ జీవన పవిత్రతను ప్రశ్నార్థకం చేస్తోందని, ప్రభుత్వాలు మానవ జీవితాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

టర్కీలో ఘోర విమాన ప్రమాదం.. లిబియా సైనికాధికారి సహా ఐదుగురు మృతి

టర్కీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. లిబియా సైనికాధికారి ముహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ సహా ఐదుగురు మరణించినట్లు నిర్ధారించారు. మంగళవారం రాత్రి 8:30 గంటలకు అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిందని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. దాదాపు 40 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే కూలిపోయినట్లు సమాచారం. ఫాల్కన్-50-క్లాస్ ప్రైవేట్ జెట్ శిథిలాలను అంకారా సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లియోనల్‌ మెస్సి సోదరి

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సోదరి మరియా సోల్‌ మెస్సి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మియామిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సోల్‌ మెస్సికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆమె తన ఎస్‌యూవీ కారులో వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె వాహనంపై నియంత్రణకోల్పోయి ఓ గోడకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోల్‌ మెస్సికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా […]

భారత దౌత్యవేత్తకు బంగ్లాదేశ్‌ సమన్లు

బంగ్లాదేశ్‌లోని భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ అయ్యాయి. న్యూ ఢిల్లీ, సిలిగురిలో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. భారత్‌లోని తమ దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై బంగ్లాదేశ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దౌత్య కార్యాలయాలపై దాడులు, బెదిరింపులను బంగ్లాదేశ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

జ‌ర్మ‌నీలో రాహుల్ గాంధీ.. భార‌త ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై ఆందోళ‌న

లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టిస్తున్నారు. బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. భార‌తీయ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఓట‌రు జాబితా అంశంలో తీవ్ర స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లిజ‌నింగ్ అన్న టాపిక్‌పై రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. 2024లో హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు […]

బంగ్లాదేశ్‌లో హింస‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఐక్య‌రాజ్య‌స‌మితి

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస ప‌ట్ల యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియా గుటెర్ర‌స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హిందూ వ్య‌క్తిని కొట్టి చంపిన ఘ‌ట‌న ప‌ట్ల ఆయ‌న రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం వాస్త‌వ‌మే అని యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌తినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. దేశంలోని ప్ర‌తి పౌరుడు సుర‌క్షితంగా ఉండేందుకు ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వాసంతో ఉన్న‌ట్లు డుజారిక్ తెలిపారు.

కారు బాంబు పేలుడులో ర‌ష్యన్‌ జ‌న‌ర‌ల్ మృతి

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో కారు బాంబు పేలుడు ఘ‌టన‌ జ‌రిగింది. ఆ పేలుడు ఘ‌ట‌న‌లో ర‌ష్య‌న్ జ‌న‌ర‌ల్ మృతిచెందిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. న‌గ‌రంలోని ద‌క్షిణ ప్రాంతంలో జ‌రిగిన పేలుడు వ‌ల్ల భారీ సంఖ్య‌లో వాహ‌నాలు  దెబ్బ‌తిన్నాయి. కారు డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. పేలుడు ప్ర‌మాదంలో మృతిచెందిన బాధిత వ్య‌క్తిని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఫానిల్ స‌ర్వ‌రోవ్‌గా గుర్తించారు. జ‌న‌ర‌ల్ స్టాఫ్ ఆప‌రేష‌నల్ ట్రైనింగ్ విభాగంలో ఆయ‌న చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ స‌ర్వీసు ఆ పేలుడుకు పాల్ప‌డి ఉంటుంద‌ని […]

సిక్కుల ఊరేగింపునకు.. న్యూజిలాండ్ నిరసనకారులు ఆటంకం

సిక్కుల ఊరేగింపును న్యూజిలాండ్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ దేశ యుద్ధ కళ ‘హాకా’ ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రపంచీకరణ, వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న సిక్కులు శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. రాజకీయ, మతపరమైన ప్రాముఖ్యత ఉన్న బ్రియాన్ టమాకి నేతృత్వంలోని ‘ట్రూ పేట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్’ గుంపు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ‘ఇది న్యూజిలాండ్‌. ఇండియా కాదు’ అంటూ పెద్ద బ్యానర్‌ను […]

అదుపుతప్పిన స్టార్ లింక్… భూమి దిశగా దూసుకొస్తున్న ఉపగ్రహం

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి ఇటీవల కక్ష్య నుంచి అదుపుతప్పి భూమిదిశగా దూసుకొస్తోంది. డిసెంబరు 17న 35956 అనే శాటిలైట్ భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. కానీ, హఠాత్తుగా అది అక్కడి నుంచి కూలిపోవడం ప్రారంభించింది.. ఈ ఉపగ్రహంపై స్పేస్‌ఎక్స్‌ నియంత్రణ కోల్పోయింది. దీనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) లేదా భూమికి ఎటువంటి ప్రమాదం లేదని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON