loader

అమెరికా ఆధీనంలో మరో చమురు నౌక!

ట్రంప్ యంత్రాంగం వెనిజులాకు అక్కడి నుండి ప్రయాణించే అనుమతి పొందిన ట్యాంకర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో అమెరికా సైన్యం కరేబియన్‌ సముద్రంలో మరో చమురు నౌకను స్వాధీనం చేసుకుంది. ‘ఒలినా’ అనే నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. యూఎస్‌ మెరైన్‌ అండ్‌ నేవీ సాయంతో ఈ ఆపరేషన్‌ చేపట్టామని పేర్కొన్న అమెరికా దళాలు నేరస్థులకు సురక్షితమైన ప్రదేశం లేదని స్పష్టం చేసింది.

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు అరెస్టు వారెంట్..

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు అనూహ్యమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వారెంట్‌ను పాకిస్తాన్ కోర్టులు కాకుండా, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ ప్రవాస ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఏ విమానాశ్రయంలోనైనా, లేదా సరిహద్దుల వద్దనైనా షాబాజ్ షరీఫ్ కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలని ఆ వారెంట్‌లో పేర్కొన్నారు.

ఆస్కార్ అకాడమీలో ‘భ్రమయుగం’.. లాస్ ఏంజెల్స్‌లో మమ్ముట్టి మూవీ స్పెషల్ స్క్రీనింగ్!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న “వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ”  అనే ప్రత్యేక వేడుక‌లో ఈ సినిమా ప్రదర్శన కాబోతుండ‌గా.. ఈ వేడుక‌కు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ‘భ్రమయుగం’ రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించ‌బోతున్నారు.

పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో

అమెరికాలో బందీగా ఉన్న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వాటి విలువ మొత్తం 5.2 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.46వేల కోట్లు ఉంటుందని అంచనా. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ సమయంలో దాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే.. ఈ తరలింపు స్విట్జర్లాండ్‌కు జరిగింది. శుద్ధి, సర్టిఫికేషన్‌ వంటి వాటి కోసం వెనెజువెలా ఈ […]

ఆస్కార్ బరిలోకి ‘కాంతార ఛాప్టర్ 1’,‘మహావతార్ నరసింహా’, ‘తాన్వీ’ సినిమాలు..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీ, ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. 98వ అకాడమీ అవార్డుల్లో భాగంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం 201 సినిమాలు ఎంట్రీ దక్కించుకున్నాయి. సంచలన విజయం అందుకున్న యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’ కూడా బెస్ట్ యానిమేటెడ్ మూవీ కేటగిరి కోసం ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది.. ‘కన్నప్ప’‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘పుష్ప 2’ వంటి సినిమాలు ఆస్కార్ నామినేషన్లను ఎంపిక చేసే కమిటీ చె తిరస్కరించబడ్డాయి..

ముందు తూటాలు..ఆ తర్వాతే మాటలు- డెన్మార్క్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో డెన్మార్క్ తీవ్రంగా యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్ ల్యాండ్ ఆక్రమించాలని చూస్తే ఆదేశాల కోసం చూడకుండా మొదట కాల్పులు జరపాలని తమ సైన్యానికి స్పష్టం చేసింది. ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాత ప్రశ్నలు అడగండి అని నిబంధనను అమల్లోకి తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ప్రకటించింది .ఇది కేవలం గ్రీన్ ల్యాండ్ సమస్య కాదని నాటో కూటమి మనుగడకే ప్రమాదం అని డెన్మార్క్ హెచ్చరించింది.

“నిరసనకారులను చంపితే ఊరుకోం.. తీవ్రంగా దెబ్బకొడతాం”: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్

ప్రముఖ రేడియో హోస్ట్ హ్యూ హెవిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. “సాధారణంగా ఇరాన్‌లో అల్లర్లు జరిగినప్పుడు అక్కడి పాలకులు ప్రజలను పొట్టనబెట్టుకోవడానికి వెనకాడరు. కానీ ఈసారి అలా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే ఆ దేశాధికారులకు నా హెచ్చరికలు చేరాయి. ప్రజలను చంపడం మొదలు పెడితే.. మేము వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.

ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు.. ఇరాన్‌లో తీవ్ర‌మైన‌ నిర‌స‌న‌లు

ఇస్లామిక్ సుప్రీంనేత స‌య్య‌ద్ అలీ హుస్సేనీ ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా ఇరాన్‌లో నిర‌స‌న‌లు తీవ్ర‌రూపం దాల్చాయి. గురువారం రాత్రి దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో భారీ ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డం, రోజు వారీ ఖ‌ర్చులు పెరిగిపోవ‌డంతో జ‌నం రోడ్ల‌మీద‌కు వ‌చ్చేశారు. వీధుల్లో ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌తో పాటు అనేక న‌గ‌రాల్లో జ‌రిగిన నిర‌స‌న వీడియోలు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

అమెరికాలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఇద్దరు భారతీయుల అరెస్ట్‌

అమెరికాలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఇండియానాలో ట్రక్కులో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అరెస్ట్‌ చేసింది. ట్రక్కులో 140 కిలోల కొకైన్‌ పట్టుబడడం సంచలనం రేపింది. గురుప్రీత్‌సింగ్‌ , జస్వీర్‌సింగ్‌లను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఇద్దరు కూడా అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ ఈ ఇద్దరు పట్టుబడ్డారు.

జర్మనీ రాజధాని బెర్లిన్ లో పవర్ కట్.. రెండు రోజులుగా అంధకారంలోనే

జర్మనీ రాజధాని బెర్లిన్ రెండు రోజులుగా చీకట్లోనే మగ్గుతోంది. తీవ్ర బ్లాకౌట్ కారణంగా 2 రోజులుగా కరెంటు లేక అల్లాడుతోంది. విద్యుత్ సరఫరా చేసే కేబుళ్లను కొందరు కావాలనే కట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అనుమానిస్తున్నారు. పవర్ కట్ కారణంగా 45,000 ఇండ్లు, 1,120 సంస్థలు చీకట్లోనే ఉన్నాయి. అసలే శీతాకాలం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ రాజధానిలో ఇలా రెండు రోజులపాటు పవర్ కట్ కావడం ఇదే మొదటిసారి. మరోవైపు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON