loader

మా జోలికొస్తే.. గల్ఫ్ రేవులపై దాడి చేస్తాం: ఐఆర్‌జీసీ

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రవాణాపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఐఆర్‌జీసీ పేర్కొంది. దానికి తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది

సుడిగుండాల్లో చిక్కుకుపోతారు: ఇరాన్‌

హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంపై ఇరాన్‌ స్పందించింది. ‘హర్మూజ్‌’ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా.. జలసంధిలో ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ నౌకాదళ విభాగం సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేసింది

చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..!

చైనాలో భారీ డేటా ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. టియాంజిన్ నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ సెంటర్ నుండి 10 పెటాబైట్‌ల సున్నితమైన సమాచారం దొంగిలించబడింది. ఇందులో క్లాసిఫైడ్ రక్షణ పత్రాలు, క్షిపణి స్కీమాటిక్స్, అధునాతన యుద్ధ అనుకరణల పరిశోధనలు ఉన్నట్లు సమాచారం. ఈ లీక్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించబడుతోంది. డేటాను ఒకేసారి కాకుండా, వేర్వేరు సిస్టమ్‌ల నుండి చిన్న చిన్న భాగాలుగా తీసుకోవడం ద్వారా హ్యాకర్ పట్టుబడకుండా తప్పించుకున్నాడు. ఈ మొత్తం ఆపరేషన్‌కు సుమారు ఆరు నెలల […]

ఇరాన్ తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

ఇస్లామాబాద్లో దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ కృషి చేసిందని, ఇరాన్తో అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే చివరకు ఎటువంటి ఏకాభిప్రాయం కుదరకపోవడం విచారకరమని ఆయన అన్నారు. తాము ప్రతిపాదించిన నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరించిందని, అందుకే ఒప్పందం లేకుండానే తాము స్వదేశానికి తిరిగి వెళ్తున్నామని ఆయన తెలిపారు.

కామెంట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే ఛాన్స్.. కొత్త ఫీచర్ లాంచ్!

ఇన్‌స్టాగ్రామ్ లో వినియోగదారులు తమ కామెంట్‌ను పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు ఎప్పుడైనా సవరించుకోవచ్చు. ఈ నిర్ణీత సమయంలో ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కేవలం టెక్స్ట్ (Text) కు మాత్రమే పరిమితం. కామెంట్లలో ఉపయోగించే ఫోటోలు, GIFలు లేదా స్టిక్కర్లను మార్చడం కుదరదు. ఏదైనా మార్పు చేసినప్పుడు సదరు కామెంట్ పక్కన ‘Edited’ అనే ట్యాగ్ కనిపిస్తుంది. దీనివల్ల ఆ కామెంట్‌ను సవరించినట్లు ఇతరులకు తెలుస్తుంది.

ChatGPT సృష్టికర్త ఇంటిపై బాంబు దాడి

చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ నివాసంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక గుర్తుతెలియని యువకుడు పెట్రోల్ బాంబుతో దాడికి తెగబడ్డాడు. ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా తగులబెడతానంటూ నిందితుడు హెచ్చరించాడు కృత్రిమ మేధ (AI) పట్ల సమాజంలోని ఒక వర్గంలో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోతామనే భయం, డేటా ప్రైవసీపై ఆందోళనలు మరియు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రుడిని చుట్టి భూమికి చేరిన వ్యోమ‌గాములు..

ఆర్టెమిస్‌-2(Artemis II)లో చంద్రుడిని చుట్టివ‌చ్చిన వ్యోమ‌గాములు ఇవాళ సుర‌క్షితంగా భూమికి చేరుకున్నారు. 9 రోజుల జ‌ర్నీ అత్యంత విజ‌య‌వంతంగా సాగింది. ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలో ఓరియ‌న్ క్యాప్సూల్ దిగింది. త‌మ బృందం ఆరోగ్య‌వంతంగా ఉన్న‌ట్లు క‌మాండ‌ర్ రీడ్ వైజ్‌మాన్ తెలిపారు. ఏప్రిల్ ఒక‌టో తేదీన ఆర్టెమిస్ నింగికి ఎగిరింది. వ్యోమ‌గాములు సుమారు 406,771 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి వ‌చ్చారు.

అత్యంత విలువైన అమెరికా డ్రోన్ అదృశ్యం

హర్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న అత్యంత విలువైన అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైనదిగా పేరున్న ఎంక్యూ-4సి ట్రైటన్ శుక్రవారంనాడు హర్మూజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ ఈ డ్రోన్ మిషన్ తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే  ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ […]

లెబనాన్‌తో శాంతి చర్చలకు మేము సిద్ధం.. హెజ్‌బొల్లాకు హానీ తలపెట్టం..!

పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై భీకర దాడులు కొనసాగించిన ఇజ్రాయేల్ శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించింది. కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమేనని, దాడులు తగవని ఇరాన్ సహా పలు దేశాలు ఆగ్రహించిన నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. దౌత్యపరమైన ఒప్పందానికి బీరుట్‌ పదే పదే విజ్ఞప్తి చేయడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

10 నిమిషాల్లో 160 బాంబులు కురిపించిన ఇజ్రాయెల్

బనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకరంగా విరుచుకుపడ్డాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100 హిజ్బుల్లా స్థావరాలపై 160 బాంబులు కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ ఈ దాడులను ‘ఎటర్నల్ డార్క్‌నెస్’ అనే కోడ్ నేమ్‌తో నిర్వహించినట్లు సమాచారం. హిజ్బుల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON