loader

అమెరికాకు ఇరాన్ లొంగదు: ట్రంప్​నకు పెజెష్కియన్ స్ట్రాంగ్ కౌంటర్​

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్​ దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు అందరూ ఒక్కటై నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఉద్దేశించి తాజాగా మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోకుండా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్య కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

4 వారాలపాటు న్యూస్‌ టీవీ రేటింగ్స్‌ నిలిపివేత

పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్‌ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్‌ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.

నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. విజయం దిశగా నూతన పార్టీ

జెన్-జీ నిరసనల తరువాత గురువారం (మార్చ్ 5) తొలిసారిగా నేపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగాయి. నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్‌లో నూతన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి (ఆర్‌ఎస్‌పీ) విజయం దాదాపుగా ఖరారైనట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ సింగర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ 165 స్థానాలకు గాను 94 సీట్లల్లో ముందు వరుసలో ఉంది. ఇక నేపాలీ కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించగా పది స్థానాల్లో లీడ్‌లో ఉంది. సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ […]

ఏఐ ఎఫెక్ట్..ఒరాకిల్‌లో వేలాది మందికి లేఆఫ్‌లు!

ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 30 వేల ఉద్యోగుల‌ను తొల‌గించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి అనుగుణంగా సంస్థలో సమూల మార్పులు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణ కావచ్చని టెక్ నిపుణులు […]

ఇరాన్‌ ఆక్ర‌మ‌ణ టైం వేస్ట్ పని: డోనాల్డ్ ట్రంప్‌

ఇరాన్‌ను ఆక్ర‌మించాల‌న్న ఉద్దేశం త‌మ‌కు లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. స‌మ‌యం వృధా త‌ప్ప‌, దాంట్లో ఏమీ లేద‌న్నారు. అమెరికా బ‌ల‌గాల‌ను ఇరాన్‌కు పంపే ఆలోచ‌న లేద‌న్నారు. ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో ట్రంప్ ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే భూత‌ల యుద్ధం చేప‌ట్టేందుకు బ‌ల‌గాల‌ను ఇరాన్‌కు పంపాల‌న్న ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని ట్రంప్ అన్నారు. శం నేవీ కూడా పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని, ఆ దేశం అన్నీ కోల్పోయింద‌ని ట్రంప్ అన్నారు.

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఏడో రోజుకు చేరుకున్నాయి. తాజాగా.. హొర్ముజ్ జలసంధి ఒమన్ గల్ఫ్‌లో స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేసిన దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిహార్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, మహారాష్ట్రలోని ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకిగా గుర్తించారు.ఒమన్‌‌లోని ముసాందమ్‌‌ ఐల్యాండ్‌‌ సమీపంలో అనగా ఖసాబ్‌‌ ఓడరేవుకు ఉత్తరాన సుమారు 5 నాటికల్‌‌ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది.

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి.. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో విద్వంసం

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది.తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఏకంగా ఒకేసారి 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో దాడికి పాల్పడింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ మంటల్లో కాలిపోయింది. అయితే ఇరాన్ దాడిని మాత్రం బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకోలేకపోయింది.

ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రధాని మోదీ ఫోన్‌..!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు. యుద్దాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు దేశాధినేతలు మంతనాలు జరిపారు. శాంతి, సుస్థిరత కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుద్దంపై ఇప్పటికే గల్ప్‌ దేశాధినేతలతోనూ ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల చర్చలు, దౌత్యానికి తిరిగి రావాల్సిన అవసరం గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కెన‌డాలో దారుణ హ‌త్యకు గురైన పంజాబీ మ‌హిళా యూట్యూబ‌ర్‌..

పంజాబీ మూలాలు ఉన్న 45 ఏళ్ల మ‌హిళ‌ను కెన‌డాలో దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ఒంటారియోలోని లాస‌ల్లిలో జ‌రిగింది. బాధిత వ్య‌క్తిని నాన్సీ గ్రేవ‌ల్‌(YouTuber Nancy)గా గుర్తించారు. యూట్యూబ‌ర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్న‌ది. మంగ‌ళ‌వారం రాత్రి ఆమెపై అటాక్ జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో చాలా చురుకైన కామెంట్లు చేయ‌డంలో నాన్సీ గ్రేవెల్‌కు పేరున్న‌ది. ఇండో-కెన‌డా ఉద్రిక్త‌త‌లపై కామెంట్ చేశారు. జ‌స్టిన్ ట్రూడోను, ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాదుల‌ను ఆమె ఖండించారు. పంజాబీకి చెందిన మ‌త‌, రాజ‌కీయవేత్త‌ల‌ను […]

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం.. మధ్యవర్తిత్వానికి చైనా సిద్ధం

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గల్ఫ్‌ దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరిపారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా, శాంతి నెలకొనేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నంలో చైనా చివరిదాకా ప్రయత్నిస్తుందని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చైనా విదేశాంగ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON