loader

‘బతికే ఉన్నాడు.. కానీ”: మోజ్తాబా ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా? లేదా? మోజ్తాబా ఖమేనీ “ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని” తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ కూడా మోజ్తాబా గాయపడినట్లు ధ్రువీకరించారు. ఆయన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, అందుకే రహస్య ప్రదేశంలోని ఆస్పత్రిలో చికిత్స […]

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ (Adobe) సీఈవో శంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించిన ఆయన, సంస్థలో కీలక మార్పులకు నాంది పలికారు. అయితే, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారని సంస్థ స్పష్టం చేసింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, బోర్డు ఛైర్మన్‌గా కంపెనీకి తన మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటారు.

కుప్పకూలిన అమెరికా విమానం

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన KC-135 ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపే ఈ భారీ విమానం ప్రమాదానికి గురవ్వడం కలకలం సృష్టిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో అమెరికా రక్షణ బలగాలు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శత్రు దేశాల కాల్పుల వల్ల కానీ, లేదా ‘ఫ్రెండ్లీ ఫైర్’ వల్ల […]

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామనే నెపంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలు తమ మద్దతును ప్రకటించాయి. అయితే, ఈ ఓటింగ్‌ ప్రక్రియకు చైనా మరియు రష్యా వంటి దేశాలు దూరంగా ఉండటం గమనార్హం, ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న చీలికను మరోసారి స్పష్టం చేసింది.

ఒక్క రాత్రే 200 రాకెట్లు ఫైర్ చేసిన‌ హిజ్‌బుల్లా..

లెబ‌నాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ హిజ్‌బుల్లా.. బుధ‌వారం రాత్రి ఇజ్రాయెల్‌పై భీక‌ర దాడికి పాల్ప‌డింది. ఒక్క రాత్రే సుమారు 200 రాకెట్ల‌ను ఫైర్ చేసింది. ఇజ్రాయెల్ ఉత్త‌రం వైపున ఆ దాడి జ‌రిగింది. దీంతో వేల సంఖ్య‌లో ఇజ్రాయిలీ ప్ర‌జ‌లు ప్రాణ ర‌క్ష‌ణ కోసం షెల్ట‌ర్ల‌కు వెళ్లి దాక్కున్నారు. ఐడీఎఫ్ ప్ర‌కారం బుధ‌వారం రాత్రి హిజ్‌బుల్లా సుమారు 200 రాకెట్ల‌ను , 20 డ్రోన్లను ఫైర్ చేసింది. దీంట్లో చాలా వ‌ర‌కు రాకెట్ల‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేశారు.

యుద్ధం ముగింపునకు 3 షరతులు విధించిన ఇరాన్- అవేంటో తెలుసా?

అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మూడు షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు.

ఇన్‌స్టాగ్రామ్ ఒక్కసారిగా డౌన్.. యూజర్లు తీవ్ర ఇబ్బందులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ఉదయం నుండి తీవ్రమైన సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. వేలాది మంది వినియోగదారులు ఈ యాప్‌ను యాక్సెస్ చేయడంలో, దాని ఫీచర్లను ఉపయోగించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రియల్-టైమ్ అంతరాయాలను నిశితంగా గమనించే ‘డౌన్‌డెటెక్టర్’  వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, మార్చి 11 ఉదయం నుండి ఇన్‌స్టాగ్రామ్ పనితీరుపై ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి

హర్మూజ్‌ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు-

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ మోహరించిన మైన్‌లేయర్స్‌, నౌకలు లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడడంతో అవి ధ్వంసమయ్యాయి. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌తో పాటు పలు నౌకలు ధ్వంసం అయ్యాయని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుడు సృష్టించడానికి ఇరాన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా ప్రచురించింది.

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం… ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇకపై చర్చలకు అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ట్రంప్‌నకు మోసం చేయడం ఎలాగో బాగా తెలుసు. ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవడం తెలియదు. సంప్రదింపులు జరుగుతుండగానే రెండుసార్లు యుద్ధానికి దిగారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాల యుద్ధానికి ఇరాన్ సిద్ధమవుతోంది’ అని ఖరాజీ తెలిపారు.

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో శాంతి లేదా యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించే అధికారం కేవలం తమ సాయుధ బలగాలకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా సైనికులు ఇక్కడ యుద్ధాన్ని ముగించే శక్తిని కలిగి లేరని, ప్రాంతీయ భవిష్యత్తును నిర్ణయించేది క్షేత్రస్థాయిలో ఉన్న తమ సైనిక సామర్థ్యమేనని IRGC పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON