అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మూడు షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు.

