లెబనాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా.. బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌పై భీకర దాడికి పాల్పడింది. ఒక్క రాత్రే సుమారు 200 రాకెట్లను ఫైర్ చేసింది. ఇజ్రాయెల్ ఉత్తరం వైపున ఆ దాడి జరిగింది. దీంతో వేల సంఖ్యలో ఇజ్రాయిలీ ప్రజలు ప్రాణ రక్షణ కోసం షెల్టర్లకు వెళ్లి దాక్కున్నారు. ఐడీఎఫ్ ప్రకారం బుధవారం రాత్రి హిజ్బుల్లా సుమారు 200 రాకెట్లను , 20 డ్రోన్లను ఫైర్ చేసింది. దీంట్లో చాలా వరకు రాకెట్లను ఇంటర్సెప్ట్ చేశారు.

