loader

ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు లేవు.. ఎందుకో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల పట్ల గౌరవం, వారి కుటుంబాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూ.. ఎటువంటి వినోద కార్యక్రమాలు లేకుండా లీగ్‌ను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.

బిర్లా గ్రూప్‌కి RCB టీమ్! రూ.16,745 కోట్లకు అమ్ముడుపోయిన డిఫెండింగ్ ఛాంపియన్…

ఐపీఎల్ 2025 సీజన్‌ టైటిల్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. దాదాపు 1.78 బిలియన్ డాలర్లకు (దాదాపు 16,745 కోట్ల రూపాయలకు) ఆర్‌సీబీ టీమ్‌ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ విక్రయంలో బిర్లాస్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లిట్జర్, బ్లాక్ స్టోన్ సంస్థలు సంయుక్తంగా ఆర్‌సీబీని కొనుగోలు చేశాయి. ఈ డీల్‌తో క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన టీమ్‌గా సరికొత్త రికార్డు […]

చేతులు మారిన రాజస్థాన్‌ రాయల్స్‌!

ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 1.63 బిలియన్ డాలర్లతో (రూ.15 వేల కోట్లు) ఈ ఫ్రాంఛైజీని దక్కించుకున్నట్లు సమాచారం.

బాంబుల మోతల మధ్య చెస్ ఆడలేను.. క్యాండిడేట్స్ టోర్నీని బాయ్‌కాట్ చేస్తున్నా.

భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలిగింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నందున భదత్రపై ఆందోళనగా ఉందని చెప్పిన ఆమె.. బాంబుల మోతల మధ్య చెస్‌పై శ్రద్ధ పెట్టడం సాధ్యమవ్వదని వాపోయింది. మధ్య ఆసియాలోని సిప్రస్‌లో మార్చి 28 నుంచి మొదలయ్యే ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో తాను ఆడడం లేదని సోమవారం హంపి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

ఇషాన్ కిషన్ కు సన్ రైజర్స్ కెప్టెన్సీ

మరో పది రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న వేళ.. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. డిప్యూటీగా అభిషేక్ శర్మను నియమించింది. రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నట్లు ఎస్ఆర్ హెచ్ తెలిపింది. అతడి గైర్హాజరీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇషాన్ నడిపిస్తాడని వెల్లడించింది.

పెద్ది సెట్స్‌లో తిలక్ వర్మ.. బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్ చరణ్..!

పెద్ది సినిమా సెట్స్‌కు టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ వెళ్లాడు. రామ్ చరణ్‌తో కాసేపు ముచ్చటించాడు. తిలక్ వర్మకు.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ వాడిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్‌కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్‌లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్‌ను సైనా కోరింది.

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫ్రాంచైజీ గురువారం తమ కొత్త మ్యాచ్ జెర్సీని అత్యంత ఆకర్షణీయంగా ఆవిష్కరించింది. ఎరుపు, నీలం రంగుల అద్భుతమైన మేళవింపుతో ఈ జెర్సీని రూపొందించారు. జెర్సీ మధ్యలో సింహం బొమ్మ, వజ్రాల ఆకృతులలోకి మారుతుందని ఫ్రాంచైజీ పేర్కొంది. “సింహం దూకుడు, ప్రతిభకు ప్రతీక అయితే… కఠోర శ్రమ, ఒత్తిడిలో రాటుదేలిన తర్వాత ఆ ప్రతిభ వజ్రంలా మారుతుందనడానికి ఈ […]

ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు,మిథాలీరాజ్‌,శుభ్‌మన్‌కు కూడా

టీమిండియా మాజీ హెడ్ కోచ్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసిన మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ తన అద్భుత ప్రదర్శనకు గానూ ‘పాలి ఉమ్రీగర్’ (క్రికెటర్‌ […]

క్రికెట్‌లో ఫిక్సింగ్.. పలువురిపై ఐసీసీ వేటు!

అంతర్జాతీయ క్రికెట్‌లో అవినీతిని ఏమాత్రం సహించబోమని ఐసీసీ (ICC) మరోసారి స్పష్టం చేసింది. క్రికెట్ వెస్టిండీస్ (CWI) నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జావాన్ సియర్లెస్, టైటాన్స్ జట్టు యజమాని చిత్రరంజన్ రాథోడ్, జట్టు అధికారి గ్రిఫిత్‌లపై ఐసీసీ అభియోగాలు మోపింది. వీరిని తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.. 2023-24లో జరిగిన బిమ్10 టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON