ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. దాదాపు 1.78 బిలియన్ డాలర్లకు (దాదాపు 16,745 కోట్ల రూపాయలకు) ఆర్సీబీ టీమ్‌ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ విక్రయంలో బిర్లాస్తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లిట్జర్, బ్లాక్ స్టోన్ సంస్థలు సంయుక్తంగా ఆర్సీబీని కొనుగోలు చేశాయి. ఈ డీల్‌తో క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన టీమ్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది ఆర్సీబీ.

