loader

తూచ్! మేం బీఆర్ఎస్ వీడలేదు… మా మెడలో సీఎం వేసింది కాంగ్రెస్ కండువా కాదు

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు గానూ 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వివరణ ఇచ్చారు. సీఎం, ఇతర నాయకులు తమ మెడలో వేసింది కాంగ్రెస్ కండువాలు మాత్రం కాదని […]

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్‌ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో విజయ్‌ పర్యటించనున్న నియోజకవర్గాల వివరాలను పొందుపరిచారు. ఈ నెల 13న తన మొదటి విడత పర్యటనకు తిరుచ్చి సమీపంలోని […]

ఓటు చోరీ నినాదంతో ప్రజల్లోకి.. రాహుల్ గాంధీ వెల్లడి

దేశ ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోర్, గద్ది చోడ్ నినాదంతో మరింత బలంగా వెళ్లుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల నిజమైన ప్రజాస్వామిక ఓటు హక్కు చోరీ అయిందని, దేశవ్యాప్తంగా ఇది జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాబోయే రోజులలో మరింత ఆశ్చర్యకర నాటకీయ ఉదాహరణలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ బుధవారం వచ్చారు.

సీఎం చంద్రబాబు దసరా కానుక.. వారికి ఏటా రూ.15000 సాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనంతపురంలో జరిగిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రూ.15,000 ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, వారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దసరా రోజున ఈ సహాయం నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ […]

ఇక్కడ ఉంది సీబీఎన్, పవన్ కళ్యాణ్: జగన్‌కు చంద్రబాబు మాస్ వార్నింగ్

‘శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు. వీళ్ల తీరు మారలేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఉంది సీబీఎన్, పవన్ కళ్యాణ్.’ అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ‘సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి తప్పించుకోలేరు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు రప్పా రప్పా అని బెండు తీశారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు కుదరదు.’అని సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సూపర్ సిక్స్ పథకాలు అమలు: పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాయలసీమను నిజమైన రతనాల సీమగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. “ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం,” అని […]

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టున్నామని సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందు అనంతపురానికి వచ్చామని తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు ఈ సందర్భంగా ఆయన వందనం తెలిపారు.

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ […]

అబద్ధాల అంబాసిడర్‌గా కెటిఆర్:మంత్రి సీతక్క

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఒక అబద్దాల అంబాసిడర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ అబద్దాలు మానుకొని నిజాల మీద బతకాలని హితవు పలికారు. ములుగులోని మల్టి పర్పస్ వర్కర్ మైదం మహేష్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవడం చాలా సిగ్గుచేటని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. టీఆర్‌ఎస్ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు […]

రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి?

ఏపీలో మరో వారసుడి పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ విషయంపై షర్మిల కూడా క్లారిటీ ఇచ్చేశారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని షర్మిల తెలిపారు. అంతకుముందు కర్నూలు పర్యటనకు బయలుదేరిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉండటంపై ఆసక్తికర చర్చ జరిగింది. కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డికి విజయమ్మ ఆశీస్సులు అందించారు. దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఇంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON