loader

బీహార్‌లో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. మహాఘట్‌బంధన్ కూటమిలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తన పార్టీకి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఒవైసీ తన ఎన్నికల ప్రచారాన్ని ‘సీమాంచల్ న్యాయ యాత్ర’ పేరుతో ప్రారంభించారు. యాత్రను బీహార్‌లోని కిషన్‌గంజ్ పట్టణంలో ప్రారంభించిన ఆయన, ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను వివరించారు.

రెడ్‌ బుక్‌ తరహాలో డిజిటల్‌ బుక్‌ లాంచ్‌ చేసిన వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌ డిజిటల్‌ బుక్‌ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్‌ ఈ డిజిటల్‌ బుక్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు https://digitalbook.weysrcp.com/ వెబ్‌సైట్‌ను లాంఛ్‌ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్‌ ఈ డిజిటల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. 040-49171718 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు […]

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆలయ నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. “ఇది కేవలం ఒక బాధ్యత […]

ఆ లగ్జరీ కార్లు మీ వద్దకు ఎలా వచ్చాయి?.. కెటిఆర్‌ను ప్రశ్నించిన బండి

లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిష్టర్ […]

విజయ్ ర్యాలీకి వచ్చిన జనాల గురించి కమల్ హాసన్ కామెంట్స్

చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు ఎంత పెద్ద జనసమీకరణ చేసినా, ఆ జనం అంతా ఓట్లుగా మారరని అన్నారు. ఈ విషయం తనకూ, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్‌కి కూడా వర్తిస్తుందన్నారు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ర్యాలీల్లో కనిపిస్తున్న భారీ జనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు కమల్ ఈ సమాధానం చెప్పారు.

తిరుమలను వాడుకోవడం చంద్రబాబు, లోకేష్‌కు అలవాటు – వైసీపీ.

తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు అలవాటుగా మారిందని వైసీపీ  ఆరోపించింది.. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయ వేదికగా మార్చడం అనైతికమని పార్టీ విమర్శలు గుప్పించింది. తిరుమల వంటి జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన పవిత్రక్షేత్రాన్ని రాజకీయ దాడులకు వేదిక చేయడం ఆమోదయోగ్యం కాదని, 2023లో తిరుమల పరకామణి ఘటనలో చోరీకి పాల్పడిన రవికుమార్‌ను పోలీసులు పట్టుకున్నారని ఈ సంఘటనలోనూ చంద్రబాబు, లోకేష్‌లు రాజకీయ లాభం దక్కించుకోవాలని ప్రయత్నించడం […]

వాళ్లకు కూడా ఇలాంటి షరతులు విధించే ధైర్యం ఉందా?..డీఎంకేపై విజయ్

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకులు విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ సమావేశాలకు డీఎంకే సర్కార్ అనేక షరతులు విధిస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సమయంలో కూడా డీఎంకే సర్కార్ ఇలాంటి షరతులను విధించే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు.పుత్తూరులో జరిగిన భారీ ర్యాలీలో విజయ్ ప్రసంగిస్తూ… డీఎంకే ప్రభుత్వం తన కదలికలను నియంత్రిస్తుందని ఆరోపిస్తుందని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ కు..  కోటా వినుత  సంచలన లేఖ.. !

శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి సాయి ప్రసాద్ ఇవ్వడం పై అభ్యంతరాన్ని తెలుపుతున్నాను ఈ విషయం పైన పురాలోచన చేయాలని విజ్ఞప్తి అంటూ వెల్లడించింది.. మహిళలంటే కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి నియమించడం మంచిది కాదని నాపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రధాన నిందితుడు ఈ సాయి ప్రసాద్ ఒకరని, ఆధారాలు కూడా జనసేన కార్యాలయంలో ఉన్నాయని మీ దృష్టికి ఎవరు చేరనివ్వలేదని భావిస్తున్నాను.

శింగనమల అభివృద్ధిపై పవన్‌కు ఎమ్మెల్యే శ్రావణి వినతి

శింగనమల నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వెల్లడించారు. శింగనమల నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా దిగజారిందని తెలిపారు. చాలా గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై, వర్షాకాలంలో గమ్యం కాకుండా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రోడ్ల నిర్మాణానికి మరియు అప్పటికే ఉన్న రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు తెలిపారు.

పవన్ ‘ఓజీ’.. రేవంత్ Vs హరీష్ రావు

ఓజీ సినిమాకు టికెట్‌ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు స్పెషల్‌ షోకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప–2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్‌ షోలకు అనుమతిచ్చేది లేదంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్‌ చేసిన ప్రకటన క్లిప్‌ను హరీశ్‌రావు తన పోస్ట్‌కు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్‌ షోలకు ఎలా అనుమతిస్తారు అని రేవంత్‌  ఉద్దేశిస్తూనే ‘యూ టర్న్‌’ అంటూ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఇది సోషల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON