చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు ఎంత పెద్ద జనసమీకరణ చేసినా, ఆ జనం అంతా ఓట్లుగా మారరని అన్నారు. ఈ విషయం తనకూ, ఇటీవల
రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్‌కి కూడా వర్తిస్తుందన్నారు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ర్యాలీల్లో కనిపిస్తున్న భారీ జనం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు కమల్ ఈ సమాధానం చెప్పారు.

