ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆలయ నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. “ఇది కేవలం ఒక బాధ్యత కాదు.. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం!” అంటూ ప్రారంభించారు.

