loader

నాపై కుట్రలు చేశారు…వినుత కోట ఎమోషనల్

శ్రీ కాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోట ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. తాను లక్షల రూపాయల జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికి స్పష్టం చేశారు. తన డ్రైవర్ రాయుడుని తాను హత్య చేయలేదని.. అయినా ఈ కేసులో జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని కలవటానికి ప్రయత్నించానని గుర్తుచేశారు. తనపైన జరిగిన కుట్రలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో వీడియోలతో సహా ప్రజల ముందుకు వస్తానని వినుత కోట […]

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు.

బీహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలు ఖరారు.. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ

వచ్చే నెలలో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో ,రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) , హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ . […]

నా తలరాత ఏంటో నాకు తెలుసు.. సీఎం మార్పు వార్తలపై డీకే వ్యాఖ్యలు

ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం స్పందించారు. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని లాల్‌ బాగ్‌ వద్ద ప్రజలతో ముచ్చటించేందుకు వచ్చిన డీకే పత్రికా కథనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కొన్ని మీడియా చానెళ్లు వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ’ఇండియా’ కూటమి నుంచి పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ శనివారం వెల్లడించారు.

రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం

RJD కంచుకోటగా భావించే రఘోపూర్ నుంచి ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ఓడిపోతారని జన్‌ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్టే తేజస్వీ కూడా రఘోపూర్ నుంచి ఓడిపాతారని అన్నారు. వైశాలి జిల్లాలోని వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిశోర్ శనివారంనాడు శ్రీకారం చుట్టారు. రఘోపూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు, రబ్రీదేవి మూడుసార్లు శాసససభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు.

రేవంత్‌ బీసీలను దారుణంగా మోసం చేశారు : కేటీఆర్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో 42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కారు ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా […]

హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.

డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్..

నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు. అయితే ఒక్కరు మాత్రం రెండు రోజుల క్రితం ప్రచారం చేపట్టారని, ఆయన మరెవరో కాదు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో పోరాడుతూనే ఉందని, తప్పకుండా తమిళనాడు పోరాడి గెలుస్తుందన్నారు. ఎడప్పాడి పళనిస్వామి లాగే ముఖ్యమంత్రి కూడా అణగిమణిగి ఉంటారని గవర్నర్‌ భావిస్తున్నారని, అయితే ఆ ఆశలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON