loader

మహిళా ఫార్ములా 4 రేసర్

హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాకు చెందిన 17 ఏళ్ల శ్రేయ లోహియా భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రాసింది. ఆమె భారతదేశంలోనే తొలి మహిళా ఫార్ములా 4 రేసర్గా నిలిచింది. చిన్నప్పటినుండి ఆమె కార్టింగ్ రేసింగ్తో ఆసక్తి చూపుతూ, 9 ఏళ్ల వయసులో కార్టింగ్ కారును నడిపి అనుభవాన్ని సంతరించుకుంది. ఇప్పటివరకు ఆమె 30కు పైగా పోడియం ఫినిషింగ్‌లు సాధించింది. F4 రేసర్లు భవిష్యత్తులో F1 డ్రైవర్లుగా మారే అవకాశం కలిగి ఉంటారు.

అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యనిషేధం అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, రాష్ట్రంలోని మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని మరోసారి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఒక గంటలోనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీహార్‌లో మద్యనిషేధం 2016లో ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన చట్టం. ఇది మద్యం తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టుకు నిజాం వారసులు

రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన కంచగచ్చిబౌలి భూముల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో తాజాగా మరొ మలుపు చోటు చేసుకుంది. కంచగచ్చిబౌలిలో ఉన్న 2,725 ఎకరాల 23 గుంటల భూమికి నిజమైన యజమాని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని ఆయన వారసులు తాజాగా ఆరోపిస్తున్నారు. అసఫ్ జాహి రాజవంశ వారసులు కంచగచ్చిబౌలిలోని 2,725 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సుమోటో రిట్ పిటిషన్‌లో తమను చేర్చుకోవాలని ఇంప్లీడ్ పిటిషన్ […]

చరిత్ర సృష్టించిన ప్రణవ్ మహదేవ్.. తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా…

16 ఏళ్ల ప్రణవ్ మహదేవ్ సూరపనేని చరిత్ర సృష్టించాడు. జూనియర్ వరల్డ్ కప్ ఇన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్‌కు ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తిగా రికార్డుకెక్కాడు. త్వరలో కజకిస్తాన్‌లోని అస్తానాలో జరగనున్న ఐస్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ ఏడాది దేశం మొత్తం మీద నుంచి జూనియర్ వరల్డ్ కప్ ఇన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్‌ పోటీలకు ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వారిలో ప్రణవ్ మహదేవ్ కూడా ఒకడు. మిగిలిన ఇద్దరు ఉత్తర […]

సత్వర న్యాయమే లక్షంగా క్రిమినల్ చట్టాలు: అమిత్ షా

దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్షంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయి. అమలులోకి వచ్చాయని వివరించారు.కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్‌ను ఆరంభించిన క్రమంలో ఆయన […]

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ – కర్నూలు సభకు రావాలని ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకే ప్రయోజనం చేకూర్చే “Next Gen GST” సంస్కరణలను ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో నిర్వహించనున్న ‘ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ’ సభకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు.

నకిలీ మద్యం కేసు… ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటూ జోగి రమేష్ ఛాలెంజ్

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం ఊహించని ట్విస్టులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు.. వైసీపీ నేత జోగి రమేష్ మీద ఆరోపణలు చేస్తున్న వీడియో విడుదలైంది. జోగి రమేష్ ఆదేశాల ప్రకారమే కల్తీ మద్యం తయారు చేసినట్లు అందులో ఉంది. ఈ నేపథ్యంలో జనార్ధన్ రావు ఆరోపణలపై జోగి రమేష్ స్పందించారు. నకిలీ మద్యం కేసులో ఎవరినో ఒకరిని ఇరికించేందుకు చూస్తున్నారన్నారు. దమ్ముంటే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని జోగి రమేష్ డిమాండ్ […]

ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై పోలీసుల విచారణ జరగాలని కోరారు. ఈ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు వినుత డ్రైవర్ రాయుడు తెలియదని క్లారిటీ ఇచ్చారు. వినుత బెయిల్ రద్దు చేయాలని […]

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్‌ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో 10 మంది మంత్రులతో ఈ సబ్‌కమిటీ ఏర్పడింది.

ఫిర్యాదుల అంశం.. స్పందించిన మంత్రి పొంగులేటి

తనమీద సహచర మంత్రులు ఎవరూ ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మంత్రులు తనమీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క – సారక్కలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON