మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

