loader

జూబ్లీహిల్స్ రిజల్ట్.. కవిత ఆసక్తికర పోస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి […]

రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్‌ నగర ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం క్రమంగా పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలో హస్తం పార్టీకి సరైన ఫలితాలు రాలేదని,  కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి ఈ తీర్పును ఇచ్చారని రేవంత్ […]

95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి..బీజేపీ సెటైర్లు

రాహుల్‌ ఇప్పటి వరకూ 95 ఎన్నికల్లో ఓడిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2004 నుంచి 2025 వరకూ దేశంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 95 ఎన్నికల్లో ఓడిపోయిందని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ అన్నారు. ఈ ఓటమితో రాహుల్‌ 95 సార్లు ఓడిన రికార్డును కైవసం చేసుకున్నారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. అవన్నీ రాహుల్‌కే దక్కుతాయి’ అంటూ మాలవీయ ఎక్స్‌ […]

ఒక్కస్థానం నుంచి ఏకంగా 22 స్థానాలకు ఎగబాకి..!

బీహార్ శాసనసభ ఎన్నికల తుది ఫలితాల్లో ఆశ్చర్యకరమైన అంశం మోదీకి చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఒకప్పుడు ఒకే ఒక సీటుకు పరిమితమై.. రాజకీయాల్లో వెనక్కి నెట్టబడ్డారని భావించిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా 22 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతూ ఎన్డీయే కూటమికి అత్యంత బలమైన భాగస్వామిగా ఉద్భవించింది. చిరాగ్ పాశ్వాన్‌కు అప్పటి వరకు అంటగట్టిన ‘ఓటు కట్టర్’ అనే ముద్రను చెరిపివేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీ(ఆర్వీ) చరిత్రలో ఇదే అత్యుత్తమ అసెంబ్లీ ఎన్నికల ప్రదర్శనగా […]

బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండటంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఎన్నికల కమీషన్ తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు (SIR) బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండేందుకు సాయం చేసిందని అఖిలేష్ ఆరోపించారు. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ‘SIR గేమ్’ పనిచేయదని ఆయన అన్నారు.

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా […]

జూబ్లీహిల్స్​లో ‘హస్తం’ హవా​ – 25 వేలకు పైగా మెజార్టీతో నవీన్‌ యాదవ్‌ ఘనవిజయం

ఎంతో ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్ ​యాదవ్​ గెలుపొందారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్యే జరిగింది. 10 రౌండ్లు పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్​ ఆధిక్యం భారీ పెరుగుతూ వచ్చింది. 2009లో  రాజకీయంలో అడుగుపెట్టిన నవీన్​ యాదవ్​ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం వెలుగుచూసింది. ఎంఐఎంలో ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్.. 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఓటమి బాటలో లాలూ కుమారులు.. రెండో స్థానంలో తేజస్వీ

ిహార్‌లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. రఘోపూర్‌లో తేజస్వి యాదవ్ 3,016 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.. మొదటి రెండు రౌండ్లలో ముందంజలో ఉన్న తర్వాత, మూడు, నాలుగు రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు. మూడు రౌండ్ల తర్వాత LJP (RV) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ RJD అభ్యర్థి ముఖేష్ కుమార్ రౌషన్ కంటే 3,520 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ECI ప్రకారం, తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం సింగ్, రౌషన్, AIMIM అభ్యర్థి అమిత్ కుమార్ కంటే నాల్గవ […]

జ‌మ్మూక‌శ్మీర్‌లో ముందంజ‌లో బీజేపీ అభ్య‌ర్థి

జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి దేవ‌యాని రాణా ముందంజ‌లో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని న‌గ్రోటా స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. తాజా స‌మాచారం ప్రకారం సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఆమె ఆధిక్యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌మ్మూక‌శ్మీన్ నేష‌న‌ల్ పాంథ‌ర్స్ పార్టీ అభ్య‌ర్థి హ‌ర్ష్ దేవ్ సింగ్‌పై దేవ‌యాని ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మూడవ రౌండ్ ముగిసే లోగా జ‌మ్మూలోని న‌గ్రోటా సీటు నుంచి బీజేపీ అభ్య‌ర్థి ముందంలో ఉన్న‌ది.

టైగ‌ర్ అబీ జిందా హై.. నితీశ్ ఇంటి ముందు భారీ పోస్ట‌ర్‌

బీహార్‌లో  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ మ‌ళ్లీ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్డీఏ కూట‌మి 180 స్థానాల్లో అగ్ర‌స్థానంలో దూసుకెళ్తున్న‌ది. ఎన్డీఏ విక్ట‌రీ బీహార్‌లో ఖాయ‌మైంది. నితీశ్ ఖాతాలోనే ఆ స‌క్సెస్ ప‌డింది. ఇక సీఎం నితీశ్ ఇంటి ముందు ఇవాళ ఓ భారీ పోస్ట‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. టైగ‌ర్ అబీ జిందా హై అంటూ ఆకట్టుకునే రీతిలో ఆ పోస్ట‌ర్ వేశారు. పులి ఇంకా బ్రతికే ఉంది అంటూ ఆ పోస్ట‌ర్‌పై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON