loader

మ‌హిళ‌ల అకౌంట్ల‌లోకి 5 వేలు బ‌దిలీ.. సీఎం స్టాలిన్ కీల‌క ప్ర‌క‌ట‌న

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు భారీ న‌జ‌రానా అంద‌జేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఇవాళ 5 వేలు బ‌దిలీ చేసిన‌ట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. క‌లైగ‌నార్ మ‌గ‌లిర్ ఉరిమై తోగై స్కీమ్ కింద న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఒక్క రోజే రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు 6550 కోట్లు పంపిణీ చేసింది. కేఎంయూటీ స్కీమ్ మూడు నెల‌లకు చెందిన మూడు వేల‌తో వ‌న్‌టైం స‌మ్మ‌ర్ రిలీఫ్ రెండు వేలు క‌లిపి […]

మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు

చిట్యాల మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్‌జెండర్  ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన సుధాకర్ ఓటర్లను ఆకట్టుకుని ప్రత్యర్థులను ఓడించారు. ఈ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా.. సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్, సీపీఎం పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిని, బీజేపీ, బీఆర్‌ఎస్, బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేసినా 100 ఓట్ల […]

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్

3. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇందులో ఆలంపూర్ ఒకటి.ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులుంటే అధికార కాంగ్రెస్ 5, ప్రతిపక్ష బిఆర్ఎస్ 5 గెలుచుకున్నాయి. 4. దేవరకద్రలో కూడా హంగ్ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన పలితాల ప్రకారం మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6 గెలుచుకుంది. ఇక బిఆర్ఎస్ 4, బిజెపి 1, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకుంది.

మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇప్పటి వరకు 27 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. అటు బీఆర్‌ఎస్ కేవలం 6 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే బీజేపీ, ఇతర పార్టీలు ఖాతా కూడా తెరవలేదు. కానీ పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు సత్తాచాటారు. మంథని, నాగర్‌కర్నూలు, దేవరకర్ర, ధర్మపురి, కొల్లాపూర్, పెద్దపల్లి వంటి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం – 10 వార్డులకు 8 చోట్ల జయకేతనం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం సాధించింది. మొత్తం పది వార్డుల్లో 8 చోట్ల ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.  క‌విత తొలిసారి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఏఐఎఫ్‌బీకి చెందిన సింహం గుర్తుపై క‌విత మ‌ద్ధ‌తుదారులు దాదాపు అన్ని స్థానాల నుంచి […]

మంథనిలో, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుపు

మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డ్ ల్లో కాంగ్రెస్ 11, ఇండిపెండెంట్ ఒకరు, బిఆర్ఎస్ నుంచి ఒకరు గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 12 వార్డులలో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా ఒక వార్డులో బిఆర్ఎస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి దశలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం, మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దిలా ఉండగా నిర్మల్, ఖానాపూర్‌, కాగజ్‌నగర్ వంటి పట్టణాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి […]

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 103 సెంటర్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మూడు గంటలలోపు మున్సిపాలిటీల ఫలితాలు, రాత్రిలోపు కార్పొరేషన్‌ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో ఎన్నికలు జరగ్గా ఎవరికీ వారే గెలుపు అంచనాలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు.

సవాళ్లు-ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన మండలి – గవర్నర్ ప్రసంగంపై వాడీవేడి చర్చ

గవర్నర్ ప్రసంగంపై ధన్యాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు విమర్శలు చేయగా ఆరోపణలను అధికారపార్టీ సభ్యులు దీటుగా తిప్పి కొట్టారు. ఆరోపణలు నిరూపించేందుకు తాము సిద్దమని వైఎస్సార్సీపీ సభ్యులు సవాల్ విసరగా, దమ్ముంటే నిరూపించాలని దీనికి తాముసైతం సిద్దమని అధికారపార్టీ నేతలు ప్రతిసవాల్ విసిరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON