కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ చాకూర్కర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. లాతూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు గెలిచారు.లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. 2004లో లోక్ సభలో ఓడిపోయినప్పటికీ, రాజ్యసభ నుంచి హోం మంత్రి పదవిని మరియు కేంద్ర బాధ్యతలను స్వీకరించారు.

