ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది

