loader

కాంగ్రెస్ స్క్రీనింగ్​ కమిటీకి ప్రియాంక గాంధీ సారథ్యం

అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. తాజాగా అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటికీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని ఛైర్​పర్సన్​గా నియమించింది. అసోం, బంగాల్​, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో కమిటీలో నలుగురు సభ్యులు చొప్పున ఉంటారని పేర్కొన్నారు. అందులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అయిన ప్రియాంక గాంధీని అసోం కమిటీకి ఛైర్​పర్సన్​గా నియమించినట్లు పేర్కొన్నారు.

సోనియాగాంధీ మనకు రక్షణలు కల్పించిందట..ఎక్కడున్నయ్‌ రక్షణలు..?: హరీశ్‌రావు

నాడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా, అలీ కమిషన్‌ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపిన అనంతరం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దుచేసి మరణశాసనం రాసిందని మండిపడ్డారు.ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నందికొండకు మార్చి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఇయ్యాల […]

రేవంత్‌ రెడ్డికి బేసిన్లు, బేసిక్స్‌ తెలవదు.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కేటీఆర్‌

‘నదీ జనాలు-కాంగ్రెస్‌ ద్రోహాలు’అంశంపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. . మనం చరిత్రలో ఎన్నో చూశాం. కానీ చెక్‌డ్యామ్‌లను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోని ఇంకెక్కడా కానీ ఉండదు. ఎన్టీఆర్‌ చెప్పినట్టు కాంగ్రెస్ నేతలంతా కుక్క మూతి పిందలేనన్నారు కేటీఆర్‌. వట్టెం, సుంకిశాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడు రేవంత్‌ రెడ్డి అని.. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరుగడం లేదన్నారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలకు ఏపీ ఖండన

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తామే నిలిపివేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.ఈ వ్యాఖ్యలను పూర్తిగా అసంబద్ధమైనవిగా అభివర్ణించింది. చంద్రబాబు నాయుడు పేరును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయ లబ్ధికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది.

శాసనసభలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కట్టుకథలు, సీఎం రేవంత్‌రెడ్డి పిట్టకథలు : హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండు రోజులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నిన్న శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కట్టుకథలను, రేవంత్ రెడ్డి పిట్ట కథలను చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇచ్చిన […]

ఎవరైనా అలా ముస్లిం మహిళను తాకితే చెయ్యి నరికేస్తా: ఎఐఎంఐఎం నేత

ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎవరైనా సరే దురుద్దేశంతో ముస్లిం మహిళను తాకడానికి ధైర్యం చేస్తే తాను చెయ్యినరికేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర లోని జల్నా సిటీలో శుక్రవారం ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాము సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే కొంతమంది నేతలు గూండాలకు, నేరాల సంఘటనలపై అనుకూలత చూపిస్తూ […]

వంద కోట్ల స్కామ్.. మమత ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణ

పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.100 కోట్ల స్కాంకు పాల్పడిందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో  మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు  సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో స్కాంకు సంబంధించి పలు వివరాల్ని బీజేపీ వెల్లడించింది. కోల్ కతా హైకోర్టుకు కాగ్ సమర్పించిన 700 పేజీల నివేదిక […]

‘నువ్వు గుర్తిస్తే ఎంత? – గుర్తించకపోతే ఎంత?’ – కేసీఆర్​పై మంత్రి ఆనం ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​పై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కేసీఆర్​కు లేదన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచిందని తెలిపారు. దక్షత కలిగిన పాలన చంద్రబాబు చేస్తున్నారని వెల్లడించారు. దేశ, విదేశాలు సైతం తమ నాయకుడిని హర్షిస్తుంటే కేసీఆర్​ మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటూ కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మరి మహాయుతి కూటమిలో ఎందుకు?’.. అజిత్‌పవార్‌కు సంజయ్‌ రౌత్‌ ప్రశ్న

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అజిత్‌పవార్‌..పింప్రి చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అవినీతి జరిగిందని శుక్రవారం ఆరోపించారు. దీనిపై ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేన పార్టీ నాయకుడు సంజయ్‌ రౌత్‌ స్పందించారు. బీజేపీ అవినీతి చేసిందని ఆరోపిస్తూ.. ఆ పార్టీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఎందుకని రౌత్‌ ప్రశ్నించారు. అజిత్‌ పవార్‌ వర్గం ఎన్సీపీని శరద్‌పవార్‌ వర్గం ఎన్సీపీలో విలీనం చేయాలని అన్నారు. రెండు వర్గాలు కలిసిపోయి పుణె, పింప్రిచించ్వాడ్‌ లోకల్‌ బాడీ ఎన్నికల్లో పోటీ […]

తృణమూల్‌కు ఎంపీ మౌసమ్ నూర్ గుడ్‌ బై.. కాంగ్రెస్‌లో చేరిక

పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ గుడ్‌ బై చెప్పారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీలో ఆమె చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జైరామ్ రమేష్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, పీసీసీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ సమక్షంలో మౌసమ్ నూర్ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON