బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అజిత్‌పవార్..పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పోరేషన్లో అవినీతి జరిగిందని శుక్రవారం ఆరోపించారు. దీనిపై ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. బీజేపీ అవినీతి చేసిందని ఆరోపిస్తూ.. ఆ పార్టీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఎందుకని రౌత్ ప్రశ్నించారు. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని శరద్‌పవార్ వర్గం ఎన్సీపీలో విలీనం చేయాలని అన్నారు. రెండు వర్గాలు కలిసిపోయి పుణె, పింప్రిచించ్వాడ్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.

